శ్రీగురుభ్యోనమః
శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ “కర్ణాటక సంగీతత్రయం”లో ఒకరైన వాగ్గేయకారుడు.
“వాతాపి గణపతిం భజే” అన్న కీర్తన విననివారుండరంటే అతిశయోక్తి కాదేమో. అది
ఆయన రచించినదే. శ్రీ రామస్వామి దీక్షితర్, శ్రీమతి సుబ్బలక్ష్మి అంబాళ్
పుణ్యదంపతుల సంతానంగా 1735లో జన్మించారు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి
గుణగణాలను బాల్యంలోనే వీరు ప్రదర్శించారు. తన తండ్రి వద్ద తెలుగు,
సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించారు. సంగీతంపై వెలువడిన
“వెంకటాముఖి” సుప్రసిద్ధ గ్రంధం “చతుర్‌దండి ప్రకాశికై”ను అధ్యయనం చేశారు.
కావలసినమేరకు మన ధర్మగ్రంధాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగారు. ఈ
భక్త శిరోమణి కాశ్యప సగోత్రీకుడు. చిదంబరనాధ యోగి ఒకరు ముత్తుస్వామి
దీక్షితర్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ఈయనను ఉపాసనామార్గంలో అయన
ప్రవేశపెట్టారు. వారణాసిలో ఉన్నప్పుడు శ్రీ ముత్తుస్వామి ఉత్తరదేశపు
సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నారు. “శ్రీనాధాధి గరుగుహోజయతి” అనే
మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను రచించి, రాగం కూర్చారు.తిరుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను రచించారు.
నవావరణ కీర్తనలు అంటే ఏమిటి?
ఇవి శ్రీముత్తుస్వామి దీక్షితులు గారు రచించినవి. దీక్షితార్ లేక ముత్తుస్వామి దీక్షితులు దేవిభక్తుడు. శ్రీ చక్ర తొమ్మిది (నవ) ఆవరణలను వర్ణించిన దేవీ ఉపాసన కృతులను నవావరణ కీర్తనలు అంటారు. త్యాగరాజు “పంచరత్న కీర్తనలు” ఎటుల ప్రసిద్ధి చెందినవో అట్లే దీక్షితుల వారి “నవావరణ” కీర్తనలు ప్రసిద్ధి. దేవీ నవరాత్రులందు అనగా దసరా పదిరోజుల పండుగలలో గానం చేస్తారు. ఈ కీర్తనలన్నీ మొత్తం పదకొండు. మొదటి ధ్యాన కీర్తన చివరది మంగళహారతి కీర్తన. ఈ రెంటినీ వదిలితే మొత్తం తొమ్మిది నవావరణ కీర్తనలు తెలుస్తాయి. అన్ని కీర్తనలు “కమలాంబికే” లేదా “శ్రీ కమలాంబికే” అని ప్రారంభింపబడతాయి.
౧. కమాలంబికే - తోడి(ధ్యాన కృతి. నవావరణములోనికి రాదు)ఇవి శ్రీముత్తుస్వామి దీక్షితులు గారు రచించినవి. దీక్షితార్ లేక ముత్తుస్వామి దీక్షితులు దేవిభక్తుడు. శ్రీ చక్ర తొమ్మిది (నవ) ఆవరణలను వర్ణించిన దేవీ ఉపాసన కృతులను నవావరణ కీర్తనలు అంటారు. త్యాగరాజు “పంచరత్న కీర్తనలు” ఎటుల ప్రసిద్ధి చెందినవో అట్లే దీక్షితుల వారి “నవావరణ” కీర్తనలు ప్రసిద్ధి. దేవీ నవరాత్రులందు అనగా దసరా పదిరోజుల పండుగలలో గానం చేస్తారు. ఈ కీర్తనలన్నీ మొత్తం పదకొండు. మొదటి ధ్యాన కీర్తన చివరది మంగళహారతి కీర్తన. ఈ రెంటినీ వదిలితే మొత్తం తొమ్మిది నవావరణ కీర్తనలు తెలుస్తాయి. అన్ని కీర్తనలు “కమలాంబికే” లేదా “శ్రీ కమలాంబికే” అని ప్రారంభింపబడతాయి.
౨. కమలాంబా సంరక్షతు - ఆనందభైరవి ప్రధమా విభక్తి
౩. కమలాంబాం భజరే - కల్యాణి ద్వితీయా విభక్తి
౪. శ్రీ కమలాంబికాయా - శంకరాభరణం తృతీయా విభక్తి
౫. కమలాంబికాయై - కాంభోజి చతుర్ధీ విభక్తి
౬. కమలాంబికాయ: పరమ్ - భైరవి పంచమీ విభక్తి
౭. కమలాంబికాయాస్తవభక్తోహం - పున్నాగ వరాళి షష్టి విభక్తి
౮. శ్రీకమలాంబికాయం భక్తింకరోమి - శహాన సప్తమీ విభక్తి
౯. కమలాంబాజయతి - ఘంటా సంభోధన ప్రధమావిభక్తి
౧౦. శ్రీకమలాంబా జయతి - ఆహిరి సార్వవిభక్తికము
౧౧. శ్రీ కమలాంబికే - శ్రీ మంగళహారతి (నవావరణములోనికి రాదు)
అంబాళ్‌పై ఆయన వ్రాసిన, “నవవర్ణ కీర్తనలు”, నవ గ్రహాలపైన వ్రాసిన “నవగ్రహ
కీర్తనలు” ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని
సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ఎన్నో కీర్తనలను
రచించారు.
దీక్షితులవారు శ్రీ చక్రములోని తొమ్మిది ఆవరణలను గురించి, తొమ్మిది
కీర్తనలు వ్రాసినారు. వాటికి, “శ్రీపుర కమలాంబికా నవావరణ కీర్తన”లని
ప్రసిద్ధి. శ్రీపురమంటే శ్రీచక్రమే. అదీకాక – ముత్తుస్వామి దీక్షితుల జన్మ
స్థలము తిరువారూరు. దానిని సంస్కృతీకరిస్తే ‘శ్రీపురము’ అవుతుంది. ఆ
గ్రామమున వేంచేసియున్న అమ్మవారు కమలాంబిక. ఆమెయే శ్రీ లలితా త్రిపుర
సుందరి. ఆ కమలాంబికను గురించి దీక్షితుల వారు వ్రాసిన “నవావరణ కీర్తనలు”
సంగీత ప్రపంచమున జగత్ప్రసిద్ధములు. ఆ కీర్తనలలో శ్రీ ముత్తుస్వామి
దీక్షితుల ప్రతిభ పతాకస్థాయినందు కొన్నది. ఆ కీర్తనలలో శ్రీచక్ర స్వరూప
వర్ణనమే కాక, యంత్ర-మంత్రం-తంత్ర భావములు కూర్చబడినవి. ఆ కీర్తనలు మొత్తం
పదకొండు.
వీరి ఇతర ప్రముఖ రచనలు:
వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.
వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.