SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, September 27, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-18

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

18
చూడు నాయనా! నువ్వు సన్యాసివి కాదు. గృహస్థాశ్రమంలో జీవితాన్ని సాగిస్తున్నవాడివి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాలను పాటించాలి. ఈ రోజుల్లో అవి అన్నీ కుదరక పోయినా కనీస ధర్మాలైనా పాటించి తీరాలి. ఆధ్యాత్మికసాధన నీ గృహస్థాశ్రమ ధర్మాలకి అడ్డుకాకూడదు. అలాగని, సంసారజీవితంలో మునిగిపోయి ఆధ్యాత్మికసాధనను విస్మరించకూడదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకోసమై ఎదురుచూసేనీప్రేమకై పరితపించే నీవాళ్ళు ఉన్నారన్న సంగతి ఎప్పుడూ మరిచిపోకు. కనుక, ముందు వాళ్ళగురించి నీ సమయాన్ని వెచ్చించు. ఆ తరువాత నీ ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టు. అప్పుడు నీకెటువంటి అడ్డంకులు ఉండవు. ముందు వారి గురించి పట్టించుకుంటూ పోతే మరి నాకు సమయాభావం కలుగుతుంది కదా అని నువ్వు అనవచ్చు. కాని అది పూర్తిగా తప్పు భావన. కాల నిర్వహన సామర్ద్యం లేనివారు చెప్పే మాట అది. నిజానికి సమయాభావం అన్నది సాధనను వాయిదా వేసుకోవడానికి చూపించుకొనే ఒక కుంటిసాకు మాత్రమే. నువ్వు పరిణితి చెందిన వ్యక్తివి. నీకు మంచి చెడుల వ్యతాసం బాగా తెలుసు. నీ నిత్యజీవితంలో ఏది అవసరమైనదో ఏది అవసరమైనది కాదో తెలుసుకోగల జ్నానం ఉన్నవాడివి. కనుక కాలనిర్వహణ (Time management) అన్నది నీ చేతులలోనే ఉంది. నీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకోవడంలో నీకు నీవే ఉపాధ్యాయుడివి. కాలాన్ని నీకనుగుణముగా నువ్వే మార్చుకోవాలి, అంతేగాని, నువ్వే కాలం చేతిలో కీలుబొమ్మగా మారకూడదు. ఇంకా నీకు బాగా అర్ధమయ్యేలా చెప్పాలంటే, నీ చేతిలో కాలం ఉంటే నువ్వే కాల భైరవుడివి. నువ్వు కాలం చేతిలో ఉంటే నువ్వు ఒక సామాన్య మానవుడివి. ఈ విషయంలో నేను ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. నీ మనసు నుండినేనొక సాధకుడినిచాలా గొప్పవాడిని అన్న భావనను పూర్తిగా చెరిపివేసేయి. సాధనవలన గొప్పవారవరు. ధర్మాన్ని పాటిస్తేనే గొప్పతనం వస్తుంది. అటువంటి ధర్మాత్ములే సాధనలో గొప్పగొప్ప శిఖరాలు అధిరోహిస్తారు. అధర్మపథాన్న పయనిస్తూ  ఏదో గొప్ప సాధన చేస్తున్నాననుకోవటం భ్రమ మాత్రమే. దీని వలన మంచి జరుగకపోగా చెడు కలుగుతుంది.

చంచల్ - అవును గురువుగారు. నేను చేసే సాధన వలన నేనేదో గొప్పవాడినన్న అహంకారం నామనస్సులో ఉంది. తప్పక ఆ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. అని అతడు నిజాయితీగా ఒప్పుకున్నాడు.
గురూజీః నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇక మంత్రసాధనలో  కలిగే ఆటంకాలగురించి ఆలోచిద్దాం. ఆటంకాలలో ప్రధాన ఆటంకం ఆలోచనలు. మంత్రసాధనలో కలిగే ఆలోచనలను అరికట్టడం దాదాపు అసాధ్యం. ఈ రోజుల్లో చాలామందిమేము ప్రతి రోజూ ధ్యానంలో గంటలతరబడి కూర్చుంటాంఅని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇదొక కపటనాటకం. ధ్యానమంటే కళ్ళు మూసుకొని గంటలతరబడి ఒక మూల కూర్చోవడం కాదు. నీ కళ్ళు మూసుకొంటే నీ మనసు పనిచేయడం ప్రారంభిస్తుంది.  అప్పుడు మనసు నిన్ను రకరకాల విషయలోలిత లోకాలలోకి తీసుకేడుతుంది. నువ్వు ఆ లోకాలన్నీ తిరిగివచ్చేటప్పటికి నీవు సాధనకు కేటాయించిన సమయం కాస్తా అయిపోతుంది. అహంకారపూరితులు అదే గొప్ప సాధన లేదా ధ్యానము అనుకుంటారు. నిజానికి ధ్యానమంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. అనగా నీ స్వరూపాన్ని తెలుసుకోవడం. కర చరణాయుతమైన ఈ స్థూలశరీరమా లేక అంతకు మించి ఏమైనా ఉన్నదా అని తెలుసుకోవడానికి చేసెడి ప్రయత్నమే సాధన. అంతకు మించి ఏదైతో ఉన్నదో అదే ఆత్మ. అదే నీవు.“ ఆ నీవు అన్నిచోట్ల ఉన్నావు. అది లేని చోటు లేనే లేదు. ఇదే నిజమైన సాధనయొక్క పరమార్ధం. ఇది అనుభూతికావడానికి ఏకాగ్రతతో కూడిన సాధన అవసరం. ఆ ఏకాగ్రత సాధించడానికి మనకొక ఊతం కావాలి. ఆ ఊతమే మంత్రము. మంత్ర సాధనకు కొన్ని పద్దతులు ఉన్నాయి. ఆ పద్దతులు తెలుసుకొని ఆ మార్గాలలో మంత్ర సాధన చేయాలి. అప్పుడే ఆ మంత్రాలు సిద్ధిస్తాయి. ఇవేమీ తెలుసుకోకుండా ఏవో మంత్రాలని కంఠస్థం చేసి వాటికి నోటికి అప్పగించి, మనం మనస్సు వెంట పరిగెడుతూ ఉంటే కలిగే లాభం ఏముంది. ఒఠి సమయ హరణం తప్ప.
మంత్రసాధనలో వచ్చే ఆలోచనలను ఎలా అరికట్టాలో నీకు ఇదివరకే చెప్పివున్నాను. ఆ చిట్కాకి కొనసాగింపుగా ఇంకొక విషయం చెబుతాను. ప్రతీ దేవతకు మంత్రం ఉన్నట్లే ధ్యానశ్లోకం కూడా ఉంటుంది. ధ్యానశ్లోకం ఆ మంత్ర దేవతా రూపాన్ని తెలుపుతుంది. ధ్యానశ్లోకంలో చెప్పబడిన ఆ దేవతా రూపాన్ని భావిస్తూ మంత్రాన్ని ఉపాసించాలి. అలా చేయగా చేయగా నీ యొక్క సాధనా పటిమను బట్టి ఆ దేవతా దర్శనం నీకు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదీ ధ్యానశ్లోకం యొక్క ప్రాముఖ్యత. దీనికి ప్రబల నిదర్శనం భక్త ధృవ. నారదుడు శ్రీవిష్ణుమూర్తి రూపాన్ని ఎలా వర్ణించాడో ఆ రూపాన్నే ధ్యానించాడు ధృవుడు. ఆ రూపంలోనే ధృవునికి సాక్షాత్కరించాడు శ్రీవిష్ణువు. కనుక ఈవిధంగా నీ ఆలోచనలను అరికట్టడానికి ప్రయత్నించు.
చంచల్ః తప్పక ప్రయత్నిస్తాను గురూజీ. ఇక ఆ తర్వాత ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టవనుకుంటాను.
గురూజీః ఈ పద్ధతి తప్పకుండా పాటించాలి. కానీ ఆలోచనలు పూర్తిగా అరికట్టబడవు. అవి మళ్ళీ మళ్ళీ నీ మీదకు యుద్ధానికి వస్తూనే ఉంటాయి.

చంచల్ః గురువుగారు, చాలా గజిబిజిగా ఉంది. ఆలోచనలు ఆగకపోతే ఈ పద్ధతి పాటించి ఏం లాభం?

గురూజిః సాధన అన్నది ఒక దాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ సాగాలి. కింది తరగతులు చదవకుండా పెద్ద తరగతులకి వెళ్ళలేము కదా. ఇది కూడా అంతే. పై పద్ధతి యొక్క ప్రాముఖ్యత నీకు చెప్పాను. కనుక ఇక ముందు నీ సాధనను ఈ విధంగా కొన్నాళ్ళు చెయ్యి. నీ ఇష్టదేవత దర్శనం నీకు తప్పకుండా కలుగుతుంది.

చంచల్ః తప్పకుండా చేస్తాను గురువుగారు. ఇంతకు ముందు మీరు మంత్ర సాధనకు కొన్ని పద్దతులున్నాయని చెప్పారు. అవి నేను తెలుసుకోవచ్చా, గురువుగారు?
గురూజీః తప్పకుండా, నాయనా!


గురువుగారు చెప్పడం ప్రారంభించారు….

Wednesday, September 20, 2017

శరన్నవ రాత్రులుశరన్నవ రాత్రులు

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. నవరాత్రులు- అంటే నవ’- నూతనమైనదీ, కొత్తదీ అనీ, ‘రాత్రి’-అంటే జ్ఞానమూ అనీ అర్థం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు'గా, 'దేవీనవరాత్రులు'గా పిలుస్తుంటారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు దశమిని దసరా అని వ్యవహరిస్తారు. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. 

ఈ నవరాత్రుల లో దేవిని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, గాయత్రి, మహాలక్ష్మి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలలితా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు.

అలాగే
 ప్రథమం శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థకీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనీతి చ|
సప్తమా కాలరాత్రే చ| అష్టమాచాతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితాః||

అని దుర్గా దేవిని కొలుస్తారు.

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం! ఈ విజయదశమి అందరికీ అన్ని రంగాలలోనూ విజయాలను చేకూర్చాలని ఆదిపరాశక్తిని ప్రార్థిద్దాం!

Saturday, September 16, 2017

Esoteric of Srividya


పూజ్య గురుదేవులు శ్రీభువనానంద నాథుల చే వ్రాయబడిచున్న శ్రీవిద్య ప్రస్థానం ఇంగ్లీష్ ఎడిషన్  ....

Esoteric of Srividya ( Spiritual journey of a common man)


Wednesday, September 13, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-17

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

17
రుసటి రోజు వాళ్ళు ఉదయం 5 గంటల గురువు గారి ఆశ్రమానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అప్పుడు మోహ వాళ్ళమ్మ ఆకర్షను అడిగింది


మోహ: అమ్మా ఈ రోజు ఇంత ప్రోద్దున్నే ఎందుకు నిద్ర లేపావు? నేను ఇంకాసేపు పడుకుంటాను.
ఆకర్ష: లేదురా కన్న. నాన్న గారు మనని బయటకు తీసుకెళ్తారంట
మోహ: వావ్, వాటర్ వరల్డ్, తర్వాత ఐమాక్స్….
ఆకర్ష: కాదమ్మా, మనం గురువు గారింటికి వెళ్తున్నాం
మోహ: గురువు గారు? గురువుగారెవరమ్మా? అక్కడ ఆడుకోవచ్చా?
ఆకర్ష: గురువు గారు నాన్న గారి వాళ్ళ టీచర్. గురువు గారు దేవుడి గూర్చి మీ నాన్నకు చెబుతారు.
మోహకు ఈ విషలేవీ అర్థం కాలేదు, ఆ చిన్ని మనస్సుకు మాత్రం ఈ రోజు ఏదో కొత్తగా జరగబోతోందని మాత్రం అనిపించింది
వాళ్ళు మగ్గురూ కలిసి గురుసిద్ధులవారింట్లోకి అడుగుపెట్టారు...
ఆరోజు ఆదివారం. ఆశ్రమంలో సూర్యోపాసన విధి జరుగుతున్నాది. కొంత మంది శిష్యులు గురువుగారితో పాటుగ అరుణపారాయణ చేస్తున్నారు. దాదాపు అందరు దేవతల మంత్రాలు అరుణంలో ఉన్నాయి. అరుణంలో ప్రకృతి ఆరాధనా, శ్రీచక్రోపాసనా మొదలైనవి రహస్యాలు చెప్పబడ్డాయి. అవి చాలా శక్తిమంతమైనవి. ఆ వేధఘోష అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా చేస్తున్నాయి. అక్కడికి వచ్చిన వారెవరికైనా వారి జీవిత చికాకులు, చింతలు గుర్తుకు రావు.
అది గురువు గారి మహత్యమో లేదా సాధనా తరంగాల వల్లనో అంటే ఖచ్చితంగా పరిపక్వమైన గురువుగారి సాధనా మహత్యమే అని అర్ధం చేసుకోగలము.

గురువు గారు వారిని చిరునవ్వుతో ఆహ్వానించాడు. చంచల్ గురువు గారి వద్దకు వెళ్ళి వారి పాదాలను తాకాడు. ఆకర్ష కూడా చెంచల్ ను అనుసరించింది. మోహాకు ఇవేమి తెలిక ఊరకుండిపోయింది. మరి ఆమెకు ఈ పద్ధతులు నేర్పబడలేదు. చంచల్ మోహాను గురువు గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పినా ఆ పాప కదలలేదు. వారు వేదపారాయణ జరిగే స్థలంలో కూర్చున్నారు. సూర్యోపాసన ముగిసిన తరువాత పాయస ప్రసాదం తీసుకున్నారు. ప్రసాదం నచ్చడంతో మోహా రెండు సార్లు తీసుకుంది. ఆ రోజు మోహకు తన రోజువారి ఆల్పాహారం కంటే ఈ ప్రసాదం భిన్నంగా వుంది. ప్రసాదం తిన్న తరువాత ఆ పాప వయస్సు పిల్లలు ఆమెను
ఆడుకోవడానికి తీసుకుని వెళ్ళారు.
చంచల్, ఆకర్ష గురువు గారి దగ్గర కూర్చున్నారు. పూర్ణ కూడా అక్కడే వున్నారు. గురువు గారు చంచల్ ని అడిగారు...
గురువు గారు: ఎలా వున్నావు చంచల్? అంతా బాగేనా? నీ ఆరోగ్యం ఎలా వుంది? సాధన బాగా సాగుతోందా?
చంచల్ : గురువు గారు, అంతా బాగానే వుందండి
గురువు గారు: కానీ నీ స్వర తరంగాలలో ఏదో తేడా వినిపిస్తోంది. సంశయించకుండా నీ సమస్య ఏమిటో చెప్పు.
చంచల్ ఆశ్చర్యపోయి గురువు గారు ఎలా గుర్తించారు అనుకొని తన సమస్యను గురువు గారితో విన్నవించుకోవాలనుకున్నాడు. చంచల్ చెప్పాడు తన రోజు వారిగా ఆఫీస్ లో ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏకరువు పెట్టాడు. గురువు గారు అన్నీ విషయాలు ఓపికతో విన్నారు.

గురువు గారు: చాలా మంది శ్రీవిద్యోపాసన స్యన్యాసులకేనని పొరపాటుగా అనుకుంటారు. ఉపాసకులు సన్యాసులవలె జీవితం గడపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది చాలా తప్పు. సూక్ష్మంగా చెప్పాలంటే శ్రీవిద్యోపాసన అంటే జీవితాన్ని ధర్మపదంలో సాగించి ఆత్మసాక్షాత్కారం పొందడం. ఆత్మసాక్షాత్కారమే మానవ జీవిత అంతిమ లక్ష్యం. క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన జీవనవిధానం అందరూ పాటించాలి. ప్రతి దేవీ, దేవత ధర్మ బద్ధమైన జీవన పథంలోనే వుంటారు. ఆశ్చర్యపడాల్సిందేమిలేదు. ఎలాగంటే, తైత్తీరీయ ఉపనిషద్ లో చేప్పినట్టుగా “భీషాత్మ వాతః పవతే; భీషోదేతి సూర్యః...” భయం కారణంగా వాయు, సూర్యుడు వారు వారు తమ కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వర్తిస్తున్నారు. మనం వాయు, సూర్యులను దేవతలుగా కొలుస్తాం. మరి వారు దేవుళ్ళు వారు దేనికి భయపడతున్నారు. ఇది గమనించవలసిన ముఖ్యవిషయం. అదే శ్రీవిద్యోపాసనలోని కీలకమైన విషయం. వారు ఎవనికి భయపడుతున్నారో అదే చైతన్యం. ఈ చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఈ చైతన్యం లేని చోటుగానీ, పదార్థం కానీ లేదు. ఈ చైతన్యం లేని వస్తువు జడం, శవం. శివం ఆనందం, ఆ ఆనందమే బ్రహ్మం. ఎవరైతే ఈ ఆనందాన్ని అనుభవిస్తారో వారు శివస్వరూపులౌతారు. తమలోని శివతత్త్వాన్ని తెలుసుకుంటారు. అదే అంహం బ్రహ్మాస్మి స్థితి. చైతన్యం శక్తి. ఈ చైతన్యం కలిగిన వాడు శివుడు. ఈ ఉనికే శివశక్త్యై రూపం, అందుకే అమ్మ వారిని శివశక్త్యై రూపమని అంటారు.
ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ప్రపంచాన్ని చూడు, అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించగలవు. ఆనందం అనుభవమౌతుంది
ఇంకా గురువు గారు చెబుతున్నారు.....

ఇంకా వుంది.......