SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, September 20, 2017

శరన్నవ రాత్రులు



శరన్నవ రాత్రులు

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవ రాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. నవరాత్రులు- అంటే నవ’- నూతనమైనదీ, కొత్తదీ అనీ, ‘రాత్రి’-అంటే జ్ఞానమూ అనీ అర్థం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు'గా, 'దేవీనవరాత్రులు'గా పిలుస్తుంటారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులు దశమిని దసరా అని వ్యవహరిస్తారు. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. 

ఈ నవరాత్రుల లో దేవిని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, గాయత్రి, మహాలక్ష్మి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలలితా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు.

అలాగే
 ప్రథమం శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థకీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనీతి చ|
సప్తమా కాలరాత్రే చ| అష్టమాచాతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితాః||

అని దుర్గా దేవిని కొలుస్తారు.

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం! ఈ విజయదశమి అందరికీ అన్ని రంగాలలోనూ విజయాలను చేకూర్చాలని ఆదిపరాశక్తిని ప్రార్థిద్దాం!

No comments:

Post a Comment