శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు
మరుసటి రోజు వాళ్ళు
ఉదయం 5 గంటల గురువు గారి ఆశ్రమానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అప్పుడు మోహ వాళ్ళమ్మ
ఆకర్షను అడిగింది
మోహ: అమ్మా ఈ రోజు
ఇంత ప్రోద్దున్నే ఎందుకు నిద్ర లేపావు? నేను ఇంకాసేపు పడుకుంటాను.
ఆకర్ష: లేదురా కన్న.
నాన్న గారు మనని బయటకు తీసుకెళ్తారంట
మోహ: వావ్, వాటర్
వరల్డ్, తర్వాత ఐమాక్స్….
ఆకర్ష: కాదమ్మా, మనం
గురువు గారింటికి వెళ్తున్నాం
మోహ: గురువు గారు?
గురువుగారెవరమ్మా? అక్కడ ఆడుకోవచ్చా?
ఆకర్ష: గురువు గారు
నాన్న గారి వాళ్ళ టీచర్. గురువు గారు దేవుడి గూర్చి మీ నాన్నకు చెబుతారు.
మోహకు ఈ విషలేవీ అర్థం
కాలేదు, ఆ చిన్ని మనస్సుకు మాత్రం ఈ రోజు ఏదో కొత్తగా జరగబోతోందని మాత్రం అనిపించింది
వాళ్ళు మగ్గురూ కలిసి
గురుసిద్ధులవారింట్లోకి అడుగుపెట్టారు...
ఆరోజు ఆదివారం. ఆశ్రమంలో
సూర్యోపాసన విధి జరుగుతున్నాది. కొంత మంది శిష్యులు గురువుగారితో పాటుగ అరుణపారాయణ
చేస్తున్నారు. దాదాపు అందరు దేవతల మంత్రాలు అరుణంలో ఉన్నాయి. అరుణంలో ప్రకృతి ఆరాధనా,
శ్రీచక్రోపాసనా మొదలైనవి రహస్యాలు చెప్పబడ్డాయి. అవి చాలా శక్తిమంతమైనవి. ఆ వేధఘోష
అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా చేస్తున్నాయి. అక్కడికి వచ్చిన వారెవరికైనా
వారి జీవిత చికాకులు, చింతలు గుర్తుకు రావు.
అది గురువు గారి మహత్యమో
లేదా సాధనా తరంగాల వల్లనో అంటే ఖచ్చితంగా పరిపక్వమైన గురువుగారి సాధనా మహత్యమే అని
అర్ధం చేసుకోగలము.
గురువు గారు వారిని
చిరునవ్వుతో ఆహ్వానించాడు. చంచల్ గురువు గారి వద్దకు వెళ్ళి వారి పాదాలను తాకాడు. ఆకర్ష
కూడా చెంచల్ ను అనుసరించింది. మోహాకు ఇవేమి తెలిక ఊరకుండిపోయింది. మరి ఆమెకు ఈ పద్ధతులు
నేర్పబడలేదు. చంచల్ మోహాను గురువు గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పినా ఆ పాప కదలలేదు.
వారు వేదపారాయణ జరిగే స్థలంలో కూర్చున్నారు. సూర్యోపాసన ముగిసిన తరువాత పాయస ప్రసాదం
తీసుకున్నారు. ప్రసాదం నచ్చడంతో మోహా రెండు సార్లు తీసుకుంది. ఆ రోజు మోహకు తన రోజువారి
ఆల్పాహారం కంటే ఈ ప్రసాదం భిన్నంగా వుంది. ప్రసాదం తిన్న తరువాత ఆ పాప వయస్సు పిల్లలు
ఆమెను
ఆడుకోవడానికి తీసుకుని
వెళ్ళారు.
చంచల్, ఆకర్ష గురువు
గారి దగ్గర కూర్చున్నారు. పూర్ణ కూడా అక్కడే వున్నారు. గురువు గారు చంచల్ ని అడిగారు...
గురువు గారు: ఎలా
వున్నావు చంచల్? అంతా బాగేనా? నీ ఆరోగ్యం ఎలా వుంది? సాధన బాగా సాగుతోందా?
చంచల్ : గురువు గారు,
అంతా బాగానే వుందండి
గురువు గారు: కానీ
నీ స్వర తరంగాలలో ఏదో తేడా వినిపిస్తోంది. సంశయించకుండా నీ సమస్య ఏమిటో చెప్పు.
చంచల్ ఆశ్చర్యపోయి
గురువు గారు ఎలా గుర్తించారు అనుకొని తన సమస్యను గురువు గారితో విన్నవించుకోవాలనుకున్నాడు.
చంచల్ చెప్పాడు తన రోజు వారిగా ఆఫీస్ లో ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏకరువు పెట్టాడు.
గురువు గారు అన్నీ విషయాలు ఓపికతో విన్నారు.
గురువు గారు: చాలా
మంది శ్రీవిద్యోపాసన స్యన్యాసులకేనని పొరపాటుగా అనుకుంటారు. ఉపాసకులు సన్యాసులవలె జీవితం
గడపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది చాలా తప్పు. సూక్ష్మంగా చెప్పాలంటే శ్రీవిద్యోపాసన
అంటే జీవితాన్ని ధర్మపదంలో సాగించి ఆత్మసాక్షాత్కారం పొందడం. ఆత్మసాక్షాత్కారమే మానవ
జీవిత అంతిమ లక్ష్యం. క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన జీవనవిధానం అందరూ పాటించాలి.
ప్రతి దేవీ, దేవత ధర్మ బద్ధమైన జీవన పథంలోనే వుంటారు. ఆశ్చర్యపడాల్సిందేమిలేదు. ఎలాగంటే,
తైత్తీరీయ ఉపనిషద్ లో చేప్పినట్టుగా “భీషాత్మ వాతః పవతే; భీషోదేతి సూర్యః...” భయం కారణంగా
వాయు, సూర్యుడు వారు వారు తమ కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వర్తిస్తున్నారు. మనం వాయు,
సూర్యులను దేవతలుగా కొలుస్తాం. మరి వారు దేవుళ్ళు వారు దేనికి భయపడతున్నారు. ఇది గమనించవలసిన
ముఖ్యవిషయం. అదే శ్రీవిద్యోపాసనలోని కీలకమైన విషయం. వారు ఎవనికి భయపడుతున్నారో అదే
చైతన్యం. ఈ చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఈ చైతన్యం లేని చోటుగానీ, పదార్థం కానీ
లేదు. ఈ చైతన్యం లేని వస్తువు జడం, శవం. శివం ఆనందం, ఆ ఆనందమే బ్రహ్మం. ఎవరైతే ఈ ఆనందాన్ని
అనుభవిస్తారో వారు శివస్వరూపులౌతారు. తమలోని శివతత్త్వాన్ని తెలుసుకుంటారు. అదే అంహం
బ్రహ్మాస్మి స్థితి. చైతన్యం శక్తి. ఈ చైతన్యం కలిగిన వాడు శివుడు. ఈ ఉనికే శివశక్త్యై
రూపం, అందుకే అమ్మ వారిని శివశక్త్యై రూపమని అంటారు.
ఈ విషయాన్ని మనస్సులో
ఉంచుకుని ప్రపంచాన్ని చూడు, అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించగలవు. ఆనందం
అనుభవమౌతుంది
ఇంకా గురువు గారు
చెబుతున్నారు.....
ఇంకా వుంది.......
No comments:
Post a Comment