SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Thursday, July 6, 2017

గురుపూర్ణిమ - గురుపూజ



Devanagari Version of GuruPuja



గురుపూజా విధిః


శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ లలితా మహా త్రిపురసుందర్యై నమః
శ్రీగురుస్సర్వకారణ భూతాశ్శక్తిః

( ఈ నెల 09 తేది గురుపూర్ణిమ సందర్భంగా గురుపూజ విధిని మన కోసం మన గురువులచే ప్రసాదించబడిన అఖండ అనుగ్రహం, అమృత స్వరూప గురువుల విధి పూర్వకంగా అర్చించి తరించాలని ఆశిస్తూ.....)
బ్రహ్మవిద్యా సంప్రదాయ గురుస్తోత్రమ్
ఓం బ్రహ్మలోకాదా శేషాలోకాలోక పర్వతాత్,
యేసంతి ద్విజాస్తేభ్యో నిత్యం నమామ్యహం
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః
సర్వోపప్లవ రహిత ప్రఙ్ఞాన ఘనప్రత్యగర్ధో
 బ్రహ్మైవాహమస్మి సోహమస్మి  బ్రహ్మాహమస్మి

శ్రీనాథాది గురుత్రయం గణపతి పీఠత్రయం భైరవం సిద్దౌగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం,
వీరాన్ద్వ్యష్ట చతుష్కషష్టినవకం వీరావళీ పంచకం,
శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం.

గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః,
గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవేనమః.

వందే గురుపద ద్వంద్వమవాంగ్మానసగోచరమ్ రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః.
నారాయణం పద్మభువం వసిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ,
వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం.
శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామల కంచ శిష్యం,
తంత్రోటకం వార్తిక కారమన్యానస్మద్గురూన్ సంతత మానతోస్మి.

దీపారాధనం, ఆచమనీయం, దేశకాలసంకీర్తనం యధావిధిగా చెయ్యాలి.



ధ్యానం
నిత్యానందం పరమసుఖదం కేవలం ఙ్ఞానమూర్తిం, విశ్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యం, ఏకం నిత్యం విమలమచలం సర్వదాసాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురు ధ్యాయామి.

ఆవాహనం
అఙ్ఞానతిమిరాంథస్య ఙ్ఞానాం జనశలాకయా,
చక్షుదున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురుమావాహయామి.

ఆసనం
చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం,
నాదబిందుకళాతీతం తస్మై శ్రీగురవేనమః
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః ఆసనం సమర్పయామి.

పాద్యం
గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః,
గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవేనమః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
పాదయోః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం
అఖండమండలాకారం వ్యాప్తంయేనచరాచరం,
తత్పదం దర్శితం యేనతస్మై శ్రీ గురవేనమః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః.
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం
సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే,
నమోవేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
ముఖే ఆచమనీయం సమర్పయామి.

స్నానం
ఙ్ఞానశక్తిం సమారూహ్య తత్త్వమాలావిభూషిణే,
భక్తి ముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీగురవేనమః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
స్నానం సమర్పయామి.

వస్త్రం
అనేక జన్మ సంప్రాప్త కర్మ ధర్మ విదాహినే,
ఙ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవేనమః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
వస్త్రయుగ్మం సమర్పయామి.

ఆభరణం
మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్శ్రీ జగద్గురుః,
స్వాత్మైవ సర్వ భూతాత్మా తస్మై శ్రీగురవేనమః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
ఆభరణం సమర్పయామి.

గంధం
గురుశ్శివో గురుర్దేవో గురుర్బంధుశ్శరీరిణాం,
గురురాత్మా గురుర్జీవః గురోరన్యన్నవిద్యతే.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
గంధంధారయామి.
పుష్పాణిః
స్థావరం జంగమంవ్యాప్తం యత్కించిత్ సచరాచరం,
తత్పదం దర్శితంయేన తస్మై శ్రీగురవేనమః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
పుష్పాణి పూజయామి.

ధూపః
చిన్మయం వ్యాపినం సర్వం త్రైలోక్యం సచరాచరం,
అస్తిత్వం దర్శితంయేన తస్మై శ్రీగురవేనమః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
ధూపమాఘ్రాపయామి.

దీపః
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం ఙ్ఞానమూర్తిం,  
విశ్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యం,  
ఏకం నిత్యం విమలమచలం సర్వదాసాక్షిభూతం,  
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
దీపం దర్శయామి.

నైవేద్యః
వందే గురుపద ద్వంద్వమవాంగ్మానసగోచరమ్ 
రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
నైవేద్యం సమర్పయామి.

తాంబూలః
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో 
వంశర్షిభ్యో నమోమహద్భ్యో నమో గురుభ్యః
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
తాంబూలం సమర్పయామి.

నీరాజనం
గురురేవ పరంబ్రహ్మ గురురేవ పరాగతిః,  
గుశబ్దస్త్వంధకారస్స్యాత్ రుశ్శబ్దస్తన్నిరోధకః,  
అంధకారనిరోధత్వాత్ గురురిత్యభిధీయతే.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
నీరాజనం సమర్పయామి.


మంత్రపుష్పం
గురుక్రమపురస్కృతే గురుశరీర నిత్యోజ్జ్వలే,
షడంగ పరివారితేకలిత ఏషపుష్పాంజలిః
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
మంత్రపుష్పం సమర్పయామి.

ఆత్మప్రదక్షిణ నమస్కారం
దేవనాథ గురోస్వామిన్ దేశికస్వాత్మనాయకః,
త్రాహి త్రాహి కృపాసింధో పూజాం పూర్ణతరాంకురు.
స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్  సమర్పయామి

పైవిధముగా పూజ జరిగిన తర్వాత సాధకుని దగ్గరలో గురుదంపతులుంటే వారికి తన శక్తికొలది కొత్త బట్టలు పెట్టి పాదపూజ చేసుకోవాలి.

                                             ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


Monday, July 3, 2017

శ్రీవిద్యా ప్రస్థానం -11

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

11


రుసటిరోజు, చంచల్ రోజూ మాదిరిగానే తన నిత్య జపాన్ని ప్రారంభించి,  జపంలోని ఏఏ తన సందేహాలను గురువు గారితోచర్చించాలి అని తలచుకుంటూ జపం ముగుంచుకున్నాడు.  ఎలాగైనా సరే ఈ పిచ్చి ఆలోచనలనుండి గట్టేక్కే మార్గం చూపమని గురువుగారిని అడగాలని లేకుంటే నేను చేస్తున్న ప్రయత్నమంతా వృధా అనుకుని గురువుగారింటికి బయలుదేరాడు.



చంచల్ గురువు గారింటికి వెళ్లే సరికి, పూర్ణ గురువుగారి దగ్గర వున్నాడు. ఇద్దరూ ఏదో విషయమై దీర్ఘంగా చర్చిస్తున్నారు. చంచల్ వెళ్ళి గురువుగారి పాదాలకు నమస్కరించి  నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

పూర్ణ గురువు గారిని ఈ విధంగా అడుగుతున్నాడు.....

పూర్ణ: గురువు గారు, జనవశీకరణకు మయూరశిఖిని ఉపయోగిస్తారంటారు అది నిజమేనా?

గురువుగారు: అవును, నిజమే

పూర్ణ: అది ఎలా ఉపయోగిస్తారు గురువు గారు?

గురువుగారు: అది ఒక ప్రయోగం. చంద్రగ్రహ సమయంలో రాత్రి సమయంలో చేస్తారు. ఈ ప్రయోగానికి ఒక పద్ధతి ఉంది. అయినా నీకు కొన్ని జనవశీకరణ మంత్రాలు ఉన్నాయి కదా? మళ్ళీ ఈ మయూరశిఖి ప్రయోగమెందుకు?
 
పూర్ణ: నాకు జనవశీకరణ అవసరంలేదు గురువు గారు. ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలని అడిగాను.

గురువుగారు: నీ గురించి నాకు తెలియదా? ఇది చాలా రహస్య పద్ధతి, ఈ ప్రయోగ పద్ధతి ఒక తరం నుండి ఇంకో తరానికి వారసత్వంగా వస్తుంది.  ఆ ప్రయోగ విధి గురించి ఒంటరిగా ఉన్నప్పుడు నీకు చెప్తాను.

పూర్ణ: ధన్యుడ్ని గురువు గారు

చంచల్ ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు. ఇప్పటికీ ఇలాంటివి ఉన్నాయా? ఈ 4జి కాలంలో ఇలాంటి విద్యలు నమ్మశక్యంగా లేదు. అసలు మనం రాతి యుగంలో ఉన్నామా? కంప్యూటర్ యుగంలో ఉన్నామా? అనుకున్నాడు.

గురు సిద్ధుల వారు చంచల్ వైపు తిరిగి అతడి క్షేమసమచారమడిగారు. తరువాత చంచల్ ఈ విధంగా అడిగాడు.....

చంచల్: గురువు గారు నేను ఇక్కడికి బయదేరే ముందు ఎన్నో విషయాలడుగాలను కున్నాను. కానీ మిమ్మల్ని చూడగానే చాలామటుకు మరిచి పోయాను.

గురువు గారు అహా... హా...హా అని నవ్వి ఇలా అన్నారు
గురుజీ: ఇది నా దర్శన మహిమ కాదు. నీ ఊగిసలాడుతున్న మనస్సు వల్ల. అదుకే నా శిష్యులకు ఎప్పుడూ చెపుతాను. మీ సందేహాలను వ్రాసి ఉంచుకోమని.

చంచల్: ఆ... అవును గురుగారు. నేను నా ఊగిసలాడుతున్న మనస్సును గూర్చి మిమ్ముఅడగాలను కున్నాను. జపం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా వుంది ఈ ఊగిసలాడుతున్న మనస్సుతో అన్నాడు చంచల్

గురుజీ: అలాగా! అయితే చెప్పు ఎమిటి నీ ఇబ్బంది.

చంచల్: గురువుగారు, నేను ప్రొద్దుటే బ్రహ్మీమూహూర్తంలో నిద్ర లేస్తున్నాను.  మీరు నిర్ధేశించిన విధంగా సంధ్యావందనం చేస్తున్నాను. బ్రహ్మీమూహూర్తంలో మేల్కోంటే మనస్సు, ఆలోచనలు కుదుట పడతాయన్నారు, కానీ....  
 
అని తన అనుభవాల్ని వివరించాడు.

అదివిని గురువు గారు ఈ విధంగా బదులు చెప్పడం ప్రారంభించారు.
గురుజీ: సమస్యా? ఇదస్సలు సమస్యే కాదు
చంచల్ ఆశ్చర్య పడ్డాడు

చంచల్: గురువుగారూ అదేంటి ఇది సమస్యే కాదంటారు? నాకు జపం పై మనస్సు కుదురట్లేదు. అసలు నేను చేస్తున్నదంతా వృధా ఏమో అని అనిపిస్తోంది.

అలా కాదు బాబూ. నీకు ఆ అమ్మ యొక్క విరాడ్రూపం తెలియట్లేదు. అని చంచల్ కు ఇలా వివరించనారంభించారు

గురూజీ: మన సంస్కారాలే మన అలోచనలు. ఇదే ఆ జగజ్జనని చిద్విలాసము, ఆమె అంతటా వుంది. జగన్మాత లేని చోటే లేదు. ఒకసారి భక్తప్రహల్లాదుడి కథ గుర్తుకు తెచ్చుకో. తన భక్తుడి కోసం భగవంతుడు స్తంబంనుండి ఉద్భవించాడు.
అంటే, ఆమ్మవారు నీ ఆలోచనలరూపంలో నీకు దర్శనమిస్తోంది. కానీ ఈ విషయం నీకు అవగతమౌవటం లేదు. అమ్మ దర్శనం ఈ విధమైన ఆలోచనల రూపంలో ఎందుకు అని నీవను కోవచ్చు.

దీనికి మన సంస్కారాలే కారణం. నీవు దేని గురించైతే ఆత్రుతచెందుతావో, ఏదైతే ఆశిస్తుంటావో ఆ విషయ వాసనలే ఈ సంస్కారాలు. ఉదాహరణకు, నీకు ధన్నాన్ని గూర్చో, కీర్తిని గూర్చో, శృంగారాన్ని గూర్చో మనస్సులో ఆలోచనలు నిండి వుంటాయి. ఇవి ఈ జన్మవే కానక్కరలేదు. గతజన్మజన్మలనుండి వస్తున్నవి కూడా వుంటాయి.

అందుకే వాటిపైకి మన మనస్సు పరిగెడుతుంది. దానితో అమ్మ వారి అసలు రూపైన సాత్విక రూపంపై మనస్సు నిలవకుంటుంది. మనందరం ఆమె పిల్లలం. అమ్మ తన పిల్లలేమడిగితే అవి ఇస్తుంది. ఎప్పుడూ తన పిల్లను నిరాశపరచదు. నీవు ధనం, కీర్తి కి సంబంధించిన ఆలోచన నిండిన మనస్సుతో ఉంటే ఆమె అదే విధమైన రూపంలో కనిపిస్తుంది. కానీ అమ్మ చాలా మధన పడుతుంది. బాధ పడుతుంది ఈ విషయవాసనలు నిండిన మనస్సులతో ఉన్న తన పిల్లలను చూడి ఏడుస్తుంది. ఓ నా బిడ్డాలారా మీ కోసం గొప్పనైన విలువైన సంపదను దాచి ఉంచాను. కానీ మీరేమో ఈ నశ్వరమైన అశాశ్వత సంపదల వెంటపడుతున్నారు.  అవి కూడనివంటే మీరు గ్రహించక ఏడుస్తారు.  నా పిల్లల ఏడుపును నేను భరించలేను. అందుకే అశాశ్వతమైన మీ కోసం వాటిని సమకూరుస్తే, మీరు ఆవిషయ వాసనల్లోనే మునిగి కూరుకు పోతున్నారు. ఒకదాని తరువాత ఒకటి గా కోరుతూనే ఉన్నారు.

ఈ కోరికలకు అంతంమే ఉండదు. కొన్ని సార్లు ఈ రొంపి నుండి నిన్ను బయటకు లాగడానికి మీ పై ప్రేమతో కఠినంగా (వ్యవహరిస్తుంటాను) ప్రవర్తిచడం జరుగుతుంది. దానికి, వాటిని పెద్ద సమస్యలుగా భావించి మీరు గ్రహదోషాలని, ఆ పూజలనీ, ఈ స్వాములనీ తిరుగుతూ వాటిని తప్పించుకోవడానికి ఉపాయం (ప్రయత్నం) చేస్తారు.

ఇలా గుళ్ళు గోపరాలవెంట తిరిగుతూ అభిషేకాలు, ధానాల రూపంగా కష్టపడి సంపాధించిన ధనాన్ని ఖర్చు చేస్తారు, అంతే కాకుండా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్నీ పోగోట్టుకుంటారు. మీ బాధలను మీ తాపత్రాయన్ని చూసి జాలితో మీ సమస్యలుగా భావిస్సున్న పరిస్థుతులను తొలగించవలసి వస్తుంది. దాని తరువాత మనస్సు మళ్ళీ శరామామూలే. నీవేప్పుడూ నేను చెప్పేది వినకుండా నీకు కావలసిన దాని గురించే ఆలోచిస్తావు. నీవు నీ అశాశ్వతమైన కోరికలకు కళ్ళేం వేసి నా వైపు అడుగులు వేస్తే నేను మీ వైపుకు పదడుగులు వేస్తాను. మీ శాశ్వతమైన అనందం పంచుతాను. ఈ శాశ్వతమైన ఆనందం ఏ విధమైన భౌతికవస్తువులతో కూడా పొందలేవు. అదే శాశ్వతమైన నిజం, శాశ్వతమైన సత్యం, శాశ్వతమైన ఆనందం. ఈ శాశ్వతమైన, నిజమైన ఆనందం ముందు ఏ భౌతికానందాలు నిలవలేవు. కానీ నీవు నా ప్రియమైన బిడ్డడివి కాబట్టి నీవడిన వన్నీ ఇస్తాను.

అమ్మ తన బిడ్డడి ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది. కానీ మొదట ఈ భౌతిక విషయవాసనలు తగ్గించు కోవాలి.

చంచల్: కానీ గురువు గారు వీటినుండి ఏలా బయట పడాలి? నన్ను అమ్మ వారు సంతోషపెడుతుంది కానీ నేను అమ్మను ఎలా సంతోష పెట్టాలి? ఈ భౌతికవిషయ వాసనల నుండి ఎలా బయట పడాలి?

గురూజీ: నిను నీవు అమ్మవారి వైపుకు మరుల్చుకోవాలి.  జపంచేసేపుడు అలాంటి ఆలోచనలు వచ్చినపుడు. ఎందుకమ్మా నాకు ఇలా దర్శనమిస్తున్నావు? నాకు ఇలాంటి దర్శనం వద్దు. నాకు నీ సత్వ దర్శనం ప్రసాదించ మని ప్రాధేయపడాలి. నిజమైన అర్తితో అర్థించాలి. నాకీ భౌతికమైన కోరిక వద్దు నాకు నీ అపారమైన ధయ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఒడిలో ఒదిగిపోవాలి. నా ఈ రజోగుణాలను తొలగించి నిజమైన, శాశ్వత ఆనందం ప్రసాదించ మని వేడుకోవాలి. అప్పుడు నీకు నీవు పెదాలతో చేస్తున్న జపం మహత్తు తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది.

చంచల్: అలా చేస్తే నా ఈ ఆలోచనలు పోతాయా? మళ్ళీ ఎప్పటికీ రావా? గురుగారు.

గురూజీ: అలాకాదు, ఆలోచనలు ఎప్పటికీ నశించవు. అవి మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే వుంటాయి.

చంచల్: అలాఅయితే ఎలా? గురుగారు, ఆలోచనలు నశించకుంటే నా జపం ఎప్పటికీ ఫలిస్తుంది?

గురూజీ: ఆలోచనలెప్పుడూ రజోగుణాన్ని సూచిస్తాయి నాయన. రజోగుణం మన నిజమైన స్నేహితులలాంటివి. నిజమైన స్నేహితులు మననేప్పుడూ అంత తొందరగావీడరు. అయితే ఇప్పటికి నేను చెప్పిన విధంగా జపం సాధన చేయు, తరువాత నీ స్థితి మెరుగుపడుతుంది అవి నీకే అర్థమౌతాయి.

తర్వాత చంచల్ విషయంలో ఏం జరిగిందో చూద్దాం.....

ఇంకావుంది....................