SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Monday, July 3, 2017

శ్రీవిద్యా ప్రస్థానం -11

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

11


రుసటిరోజు, చంచల్ రోజూ మాదిరిగానే తన నిత్య జపాన్ని ప్రారంభించి,  జపంలోని ఏఏ తన సందేహాలను గురువు గారితోచర్చించాలి అని తలచుకుంటూ జపం ముగుంచుకున్నాడు.  ఎలాగైనా సరే ఈ పిచ్చి ఆలోచనలనుండి గట్టేక్కే మార్గం చూపమని గురువుగారిని అడగాలని లేకుంటే నేను చేస్తున్న ప్రయత్నమంతా వృధా అనుకుని గురువుగారింటికి బయలుదేరాడు.చంచల్ గురువు గారింటికి వెళ్లే సరికి, పూర్ణ గురువుగారి దగ్గర వున్నాడు. ఇద్దరూ ఏదో విషయమై దీర్ఘంగా చర్చిస్తున్నారు. చంచల్ వెళ్ళి గురువుగారి పాదాలకు నమస్కరించి  నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

పూర్ణ గురువు గారిని ఈ విధంగా అడుగుతున్నాడు.....

పూర్ణ: గురువు గారు, జనవశీకరణకు మయూరశిఖిని ఉపయోగిస్తారంటారు అది నిజమేనా?

గురువుగారు: అవును, నిజమే

పూర్ణ: అది ఎలా ఉపయోగిస్తారు గురువు గారు?

గురువుగారు: అది ఒక ప్రయోగం. చంద్రగ్రహ సమయంలో రాత్రి సమయంలో చేస్తారు. ఈ ప్రయోగానికి ఒక పద్ధతి ఉంది. అయినా నీకు కొన్ని జనవశీకరణ మంత్రాలు ఉన్నాయి కదా? మళ్ళీ ఈ మయూరశిఖి ప్రయోగమెందుకు?
 
పూర్ణ: నాకు జనవశీకరణ అవసరంలేదు గురువు గారు. ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలని అడిగాను.

గురువుగారు: నీ గురించి నాకు తెలియదా? ఇది చాలా రహస్య పద్ధతి, ఈ ప్రయోగ పద్ధతి ఒక తరం నుండి ఇంకో తరానికి వారసత్వంగా వస్తుంది.  ఆ ప్రయోగ విధి గురించి ఒంటరిగా ఉన్నప్పుడు నీకు చెప్తాను.

పూర్ణ: ధన్యుడ్ని గురువు గారు

చంచల్ ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు. ఇప్పటికీ ఇలాంటివి ఉన్నాయా? ఈ 4జి కాలంలో ఇలాంటి విద్యలు నమ్మశక్యంగా లేదు. అసలు మనం రాతి యుగంలో ఉన్నామా? కంప్యూటర్ యుగంలో ఉన్నామా? అనుకున్నాడు.

గురు సిద్ధుల వారు చంచల్ వైపు తిరిగి అతడి క్షేమసమచారమడిగారు. తరువాత చంచల్ ఈ విధంగా అడిగాడు.....

చంచల్: గురువు గారు నేను ఇక్కడికి బయదేరే ముందు ఎన్నో విషయాలడుగాలను కున్నాను. కానీ మిమ్మల్ని చూడగానే చాలామటుకు మరిచి పోయాను.

గురువు గారు అహా... హా...హా అని నవ్వి ఇలా అన్నారు
గురుజీ: ఇది నా దర్శన మహిమ కాదు. నీ ఊగిసలాడుతున్న మనస్సు వల్ల. అదుకే నా శిష్యులకు ఎప్పుడూ చెపుతాను. మీ సందేహాలను వ్రాసి ఉంచుకోమని.

చంచల్: ఆ... అవును గురుగారు. నేను నా ఊగిసలాడుతున్న మనస్సును గూర్చి మిమ్ముఅడగాలను కున్నాను. జపం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా వుంది ఈ ఊగిసలాడుతున్న మనస్సుతో అన్నాడు చంచల్

గురుజీ: అలాగా! అయితే చెప్పు ఎమిటి నీ ఇబ్బంది.

చంచల్: గురువుగారు, నేను ప్రొద్దుటే బ్రహ్మీమూహూర్తంలో నిద్ర లేస్తున్నాను.  మీరు నిర్ధేశించిన విధంగా సంధ్యావందనం చేస్తున్నాను. బ్రహ్మీమూహూర్తంలో మేల్కోంటే మనస్సు, ఆలోచనలు కుదుట పడతాయన్నారు, కానీ....  
 
అని తన అనుభవాల్ని వివరించాడు.

అదివిని గురువు గారు ఈ విధంగా బదులు చెప్పడం ప్రారంభించారు.
గురుజీ: సమస్యా? ఇదస్సలు సమస్యే కాదు
చంచల్ ఆశ్చర్య పడ్డాడు

చంచల్: గురువుగారూ అదేంటి ఇది సమస్యే కాదంటారు? నాకు జపం పై మనస్సు కుదురట్లేదు. అసలు నేను చేస్తున్నదంతా వృధా ఏమో అని అనిపిస్తోంది.

అలా కాదు బాబూ. నీకు ఆ అమ్మ యొక్క విరాడ్రూపం తెలియట్లేదు. అని చంచల్ కు ఇలా వివరించనారంభించారు

గురూజీ: మన సంస్కారాలే మన అలోచనలు. ఇదే ఆ జగజ్జనని చిద్విలాసము, ఆమె అంతటా వుంది. జగన్మాత లేని చోటే లేదు. ఒకసారి భక్తప్రహల్లాదుడి కథ గుర్తుకు తెచ్చుకో. తన భక్తుడి కోసం భగవంతుడు స్తంబంనుండి ఉద్భవించాడు.
అంటే, ఆమ్మవారు నీ ఆలోచనలరూపంలో నీకు దర్శనమిస్తోంది. కానీ ఈ విషయం నీకు అవగతమౌవటం లేదు. అమ్మ దర్శనం ఈ విధమైన ఆలోచనల రూపంలో ఎందుకు అని నీవను కోవచ్చు.

దీనికి మన సంస్కారాలే కారణం. నీవు దేని గురించైతే ఆత్రుతచెందుతావో, ఏదైతే ఆశిస్తుంటావో ఆ విషయ వాసనలే ఈ సంస్కారాలు. ఉదాహరణకు, నీకు ధన్నాన్ని గూర్చో, కీర్తిని గూర్చో, శృంగారాన్ని గూర్చో మనస్సులో ఆలోచనలు నిండి వుంటాయి. ఇవి ఈ జన్మవే కానక్కరలేదు. గతజన్మజన్మలనుండి వస్తున్నవి కూడా వుంటాయి.

అందుకే వాటిపైకి మన మనస్సు పరిగెడుతుంది. దానితో అమ్మ వారి అసలు రూపైన సాత్విక రూపంపై మనస్సు నిలవకుంటుంది. మనందరం ఆమె పిల్లలం. అమ్మ తన పిల్లలేమడిగితే అవి ఇస్తుంది. ఎప్పుడూ తన పిల్లను నిరాశపరచదు. నీవు ధనం, కీర్తి కి సంబంధించిన ఆలోచన నిండిన మనస్సుతో ఉంటే ఆమె అదే విధమైన రూపంలో కనిపిస్తుంది. కానీ అమ్మ చాలా మధన పడుతుంది. బాధ పడుతుంది ఈ విషయవాసనలు నిండిన మనస్సులతో ఉన్న తన పిల్లలను చూడి ఏడుస్తుంది. ఓ నా బిడ్డాలారా మీ కోసం గొప్పనైన విలువైన సంపదను దాచి ఉంచాను. కానీ మీరేమో ఈ నశ్వరమైన అశాశ్వత సంపదల వెంటపడుతున్నారు.  అవి కూడనివంటే మీరు గ్రహించక ఏడుస్తారు.  నా పిల్లల ఏడుపును నేను భరించలేను. అందుకే అశాశ్వతమైన మీ కోసం వాటిని సమకూరుస్తే, మీరు ఆవిషయ వాసనల్లోనే మునిగి కూరుకు పోతున్నారు. ఒకదాని తరువాత ఒకటి గా కోరుతూనే ఉన్నారు.

ఈ కోరికలకు అంతంమే ఉండదు. కొన్ని సార్లు ఈ రొంపి నుండి నిన్ను బయటకు లాగడానికి మీ పై ప్రేమతో కఠినంగా (వ్యవహరిస్తుంటాను) ప్రవర్తిచడం జరుగుతుంది. దానికి, వాటిని పెద్ద సమస్యలుగా భావించి మీరు గ్రహదోషాలని, ఆ పూజలనీ, ఈ స్వాములనీ తిరుగుతూ వాటిని తప్పించుకోవడానికి ఉపాయం (ప్రయత్నం) చేస్తారు.

ఇలా గుళ్ళు గోపరాలవెంట తిరిగుతూ అభిషేకాలు, ధానాల రూపంగా కష్టపడి సంపాధించిన ధనాన్ని ఖర్చు చేస్తారు, అంతే కాకుండా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్నీ పోగోట్టుకుంటారు. మీ బాధలను మీ తాపత్రాయన్ని చూసి జాలితో మీ సమస్యలుగా భావిస్సున్న పరిస్థుతులను తొలగించవలసి వస్తుంది. దాని తరువాత మనస్సు మళ్ళీ శరామామూలే. నీవేప్పుడూ నేను చెప్పేది వినకుండా నీకు కావలసిన దాని గురించే ఆలోచిస్తావు. నీవు నీ అశాశ్వతమైన కోరికలకు కళ్ళేం వేసి నా వైపు అడుగులు వేస్తే నేను మీ వైపుకు పదడుగులు వేస్తాను. మీ శాశ్వతమైన అనందం పంచుతాను. ఈ శాశ్వతమైన ఆనందం ఏ విధమైన భౌతికవస్తువులతో కూడా పొందలేవు. అదే శాశ్వతమైన నిజం, శాశ్వతమైన సత్యం, శాశ్వతమైన ఆనందం. ఈ శాశ్వతమైన, నిజమైన ఆనందం ముందు ఏ భౌతికానందాలు నిలవలేవు. కానీ నీవు నా ప్రియమైన బిడ్డడివి కాబట్టి నీవడిన వన్నీ ఇస్తాను.

అమ్మ తన బిడ్డడి ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది. కానీ మొదట ఈ భౌతిక విషయవాసనలు తగ్గించు కోవాలి.

చంచల్: కానీ గురువు గారు వీటినుండి ఏలా బయట పడాలి? నన్ను అమ్మ వారు సంతోషపెడుతుంది కానీ నేను అమ్మను ఎలా సంతోష పెట్టాలి? ఈ భౌతికవిషయ వాసనల నుండి ఎలా బయట పడాలి?

గురూజీ: నిను నీవు అమ్మవారి వైపుకు మరుల్చుకోవాలి.  జపంచేసేపుడు అలాంటి ఆలోచనలు వచ్చినపుడు. ఎందుకమ్మా నాకు ఇలా దర్శనమిస్తున్నావు? నాకు ఇలాంటి దర్శనం వద్దు. నాకు నీ సత్వ దర్శనం ప్రసాదించ మని ప్రాధేయపడాలి. నిజమైన అర్తితో అర్థించాలి. నాకీ భౌతికమైన కోరిక వద్దు నాకు నీ అపారమైన ధయ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఒడిలో ఒదిగిపోవాలి. నా ఈ రజోగుణాలను తొలగించి నిజమైన, శాశ్వత ఆనందం ప్రసాదించ మని వేడుకోవాలి. అప్పుడు నీకు నీవు పెదాలతో చేస్తున్న జపం మహత్తు తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది.

చంచల్: అలా చేస్తే నా ఈ ఆలోచనలు పోతాయా? మళ్ళీ ఎప్పటికీ రావా? గురుగారు.

గురూజీ: అలాకాదు, ఆలోచనలు ఎప్పటికీ నశించవు. అవి మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే వుంటాయి.

చంచల్: అలాఅయితే ఎలా? గురుగారు, ఆలోచనలు నశించకుంటే నా జపం ఎప్పటికీ ఫలిస్తుంది?

గురూజీ: ఆలోచనలెప్పుడూ రజోగుణాన్ని సూచిస్తాయి నాయన. రజోగుణం మన నిజమైన స్నేహితులలాంటివి. నిజమైన స్నేహితులు మననేప్పుడూ అంత తొందరగావీడరు. అయితే ఇప్పటికి నేను చెప్పిన విధంగా జపం సాధన చేయు, తరువాత నీ స్థితి మెరుగుపడుతుంది అవి నీకే అర్థమౌతాయి.

తర్వాత చంచల్ విషయంలో ఏం జరిగిందో చూద్దాం.....

ఇంకావుంది....................

 

No comments:

Post a Comment