SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Monday, July 24, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-13

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

13దివారానికి ఇంకా రెండు రోజులు గడవాలి. చంచల్ మనస్సు చాలా ఉద్విగ్నతతో నిండివుంది. ఆదివారం కోసం ఎంతో ఆత్రుతతో వేచిచూస్తున్నాడు. ఇప్పుడు తన సాధనలో వచ్చే సందేహాలను రాసి ఉంచుకుంటున్నాడు. యధావిధిగా గాయత్రీ మంత్ర జపం చేస్తున్నాడు. గురువు గారు చెప్పిన సాధన మెళకులవును ప్రయత్నిస్తూ సాధన చేస్తున్నాడు. ఆ పద్ధతులు చంచల్పై కొన్ని క్షణాలు ప్రభావం చూపిస్తున్నాయి. మళ్ళీ షరా మామూలైపోతోంది. తన మనస్సు, నోరు వాటి పని అవి కచ్ఛితంగా చేస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ గురువు గారు చెప్పిన పద్ధతులు గుర్తుచేసుకోవడానికి  ప్రయత్నిస్తున్నా కొంచెం కొంచెం గుర్తుకొస్తున్నాయి. అందులో కొంత వరకే సఫలమౌతున్నాడు. అప్పుడు అనుకున్నాడు చంచల్ గురువుగారు చెప్పిన విషయాలన్నీ ఓ నోట్సు లా వ్రాసుకోవాలని.

ఆ రోజు శనివారం
, చంచల్ మనస్సు ఓ విధమైన ఆనందంతో, అత్రుతతో నిండిపోయి ఉంది. అతను తన సమయాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాడు. తన ఆఫీస్ సమయాన్ని ఎటువంటి పొడిగింపు లేకుండా, ఎక్కడా సమయాన్ని దుర్వినియోగపరచకుండా మరింత జాగురతతో పని చేయడం అలవాటు పరచుకున్నాడు. అదే సమయంలో, తన ఆఫీస్ మిత్రులతో ఆఫీస్ సమయం తరువాత గడపక పోవడంపై వారు తన విమర్శించడం వింటున్నాడు. కానీ చంచల్ ఆ మాటలు పట్టించుకోవడం మానేసాడు. అంతే కాక అవన్నీ అతనికి చాలా పిచ్చి మరియు వృధా మాటలుగా అనిపించసాగాయి.

చంచల్ అనుకున్నాడు రేపు నా జీవితం గొప్ప ములుపు తిరుగబోతుంది. గురువుగారు సూచించిన మార్గంలో సాధన శ్రద్ధతో చేయీలి. ఇతర అనవసరమైన విషయాలు మరియు ఆకర్షణలకు లోనుకాకూడదు. నా మనస్సును చాలా శాంతంగా వుంచుకోవాలి ముఖ్యంగా ఆడగాలి నుండి దూరంగా వుండాలి.

సినిమాల ప్రభావమే ఆడవాళ్లవైపు మనస్సుమళ్లేట్టు చేస్తుంది. కాబట్టి సినిమాలు చూడడం మానివేయాలి. ఇంకా ఎక్కువ సమయం ఆధ్యాత్మిక విషయాలపై, ధ్యానం కోసం కేటాయించాలి. మంచి జీతం కూడిన ఉద్యోగం ఉంది కాబట్టి ఆర్థికంగా ఎటువంటి లోటులేదు. ఇంకా ఒక్కర్తే కూతురు. నా జీతం నా జీవితం సాఫీగా సాగడానికి సరిపోతుంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీఆకర్ష చూసుకుంటోంది. నాకు గల ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన జిఙ్ఞాసకు తగిన సహాయం మరియుసహకారానికి మంచి గురువుగారున్నారు. జీవితానికి సంబంధించిన సత్యం తెలుసుకోవాలి. ఇప్పటికైతే నాకు అవేమి తెలిదు ఈ విషయంలో నా గురువులవారు  చెపుతారు. భవిష్యత్తులో నేను సన్యాసిగా మారుతానేమో? ఒక వేళ అలా జరిగితే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అందుకు వారికోసం ఆర్థికంగా మంచి పునాది నిర్మించాలి. 

అంతలో తన ఫోను రింగుతో ఆలోచనలనుండి బయటకొచ్చాడు. అవతలివైపు తన సహచర ఉద్యోగి ఆనంద్....

ఆనంద్: హాయ్... ఈ రోజు రాత్రి
టచ్ మీబార్ లో

చంచల్: సరిగా వినపడక పోవడంతో ..ఎంటీ
? అని అడిగాడు.
ఆనంద్: ఓరి బాబూ ! ఈ రోజు శనివారం కదా... వీకెండ్, ఈ వీకెండ్ టచ్ మీబార్ లో
చంచల్ కాసేపు మౌనంగా వుండిపోయాడు. అతనికి టచ్ మీబార్ గూర్చి తెలుసు. ఆ బార్ మిడ్ నైట్ పార్టీలకు పెట్టింది పేరు. ఇంతవరకు అతనక్కడికి వెళ్ళలేదు. అలాగని వెళ్ళాలనికూడా అనుకోవట్లేదు. అక్కడికి వెళ్తే ఎమౌతుందో అతనికి తెలుసు. మిడ్ నైట్ పార్టీలు ఒక్కోసారి తెల్లవారి 3.00 గంటల వరకు సాగుతాయి. అక్కడికి వెళ్తే గురువు గారిని కలవలేడు. అందుకే అయిష్టంగానే వీలుకాదని చెప్పాలనుకున్నాడు.

ఆనంద్: హలో
, ఏమైంది? ఏమీ మాట్లాడవేమి?

చంచల్: ఆ..., అదే ఆలోచిస్తున్నా వీలౌతుందోలేదోనని
ఆనంద్: ఏం? ఎందుకు కుదరదు? రేపు ఆదివారమే కదా? రెస్ట్ తీసుకోవచ్చులే. అదీకాక ఇది మన ఆఫీస్ వాళ్ళ వీకేండ్ పార్టీ. ఇంకా మన ఆఫీస్ మిత్రులు నీ పై అసంతృప్తిగా వున్నారు. ఈ మధ్య నీవు మాతో సరిగా కలవట్లేదు. అంతా సరిగానే వుందా? నీవు పార్టీకి రాకుంటే మనవాళ్ళు నీకు పనిలో సరిగా సపోర్ట్ చేయరు. అది నీకు చాలా ఇబ్బందికరంగా తయారకవుతుంది. అదీకాక ఇది ఫ్యామిలీ గెట్-టూ-గెదర్. భార్యతో పాటుగ అందరం కలుసుకుంటాం. ఇవ్వన్నీ నీకు తెలుసునుకో. మన బాస్ భార్య ప్రేమ కూడా వస్తుంది. ఈ అవకాశం వదులుకోకు. నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఎటువంటి మూర్ఖమైన నిర్ణయాలు తీసుకోకు. 11.00 గంటల వరకు రా... అని ఫోన్ పెట్టాడు.

ఆనంద్ చివరి మాట చంచల్ చెవ్వుల్లో మారుమ్రోగుతోంది. ఓహ్... ప్రేమ... చెరగని అందం. సహజంగానే చాలా కలివిడిగా వుంటుంది. అందరితో చాలా స్నేహంగా వుంటుంది. అవిడ సాంగత్యం ఎప్పుడూ మరువలేనిది. మగవారినందరినీ ఆమె చుట్టూ కట్టిపడేసుకుంటుంది. చాలా రోజుల తరువాత ఇండియాకొస్తోంది. మేమిద్ధరం ఒకే కాలేజీలో చదువుకున్నా.
, అందునా ఇద్దరం క్లాస్ మేట్స్ మరి ఇంకా మా సాంగత్యం అంతకంటే ఎక్కువే. అస్సలామేకు నేను గుర్తున్నానా? ఆకర్షకు ఈ విషయాలు తెలియకుండా జాగ్రత్తగా వుండాలి. ఓరి దేవుడా ఏమిటి ఈ గందరగోళం? అసలు పార్టీకి వెళ్ళాలా వద్దా? అయినా పార్టీకి వెళితే గురువుగారిని రేపు కలవడం కుదరదు.

ఇంతలో ఆకర్ష పిలుపు.....
ఆకర్ష: ఏమండీ.... ఏమిటి ఆలోచిస్తున్నారు
? అంటూ గోముగా అడిగింది.
చంచల్ కు మతిపోయింది ఆమె మాటతీరు. ఇంతఇదిగా పిలుస్తోందంటే ఏదో విషయం వుందనీ, దేనికో టెండర్ పెడుతుందన., ఆమె ఎప్పుడు ఎమండీ... !!!  అని పిలిచినా జరిగగేదదే

చంచల్: నీ గురించే .... డియర్

ఆకర్ష: ఊ... ఈ రోజు శనివారం కదా... అందుకే బయటకి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు కదా
?

చంచల్ ఓ నిట్టూర్పుతీసి ఇలా అన్నాడు...

చంచల్: అవుననుకో కానీ రేపు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఆలోచిస్తున్నా

ఆకర్ష: సరే... మనం ఓ పనిచేద్దాం
, మనం ఉరకే పార్టీ అంటెడ్ చేసి తొందరగా వచ్చేద్దాం. శ్రీమతి ప్రీతి ఫోన్ చేసి తప్పక రావాలని అంది. మనం ఐమాక్స్ లో సినిమా చూసి తరువాత అటునుండి పార్టీకి వెల్దాం. సరేనా?

చంచల్: సరే మేడమ్
, మీరు చెప్పినతర్వాత తిరుగుంటుందా? కాదనగలనా? మరి మోహా?

ఆకర్ష: ఏముంది
, ఎప్పటిలానే ఒక రూం తీసుకుంటే రూంలో నిద్రపోతుంది.

చంచల్: సరే మరి
, త్వరగా రెడికా మరి
చంచల్ మనస్సు తన పాతస్నేహితురాల్ని కలుస్తునందుకు ఓ విధమైన ఉద్రిక్తతతోనిండింది. ప్రేమ గూర్చి ఆలోచిస్తూ భారంగా నిట్టూర్చాడు. అప్పుడు తన గురువుగారి స్మృతిలోకి రాలేదు. తనకు తాను అనుకున్నాడు ఇదే ఇంక చివరి పార్టీ. రేపు నేను దీక్ష తీసుకుంటాను. ఇంక ఇలాంటివన్నీ వదలాలి కాబట్టి ఈ రోజు ఎంజాయ్ చేద్దాం.

మొత్తానికి
టచ్ మీబార్లోకి 11.00 గంటలకు అడుగుపెట్టాడు.
.......
తెల్లవారి మెలుకవ వచ్చేసరికి 7.30 అయింది.
అయ్యో! చాలా లేట్ అయిందే, తొందరగా ఫ్రేష్ కావాలి అని అనుకొని బాత్ రూమ్ కి పరిగెట్టాడు.
9.00 గంటల ప్రాతంలో గురువుగారి ఇంటికి బయలుదేరాడు.

ఇంకా ఉంది....


 


No comments:

Post a Comment