శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
-
శ్రీభువనానంధనాథులు
చంచల్ గురువుగారి
ఇంటికి వెళ్ళే సరికి వారి శిష్యులలో ఒక బృందం వేదాలు వల్లేవేస్తుంటే ఆ వేదఘోషను గురువు గారు వింటున్నారు. చంచల్ నెమ్మదిగా గురువు గారిని
సమీపించి వారి పాదాలను తాకాడు. గురువు గారిని చూడగానే ఓ విధమైన తన్మయత్వంతో మైమరచిపోయాడు. గురువు గారు తన చేతిని చంచలుడి తలపైనుంచి దీవించారు. ఆ పై వారు
చంచల్ ని ఉద్దేశించి...
గురువుగారు – ఇప్పుడు టైం ఎంత?
చంచల్ –7.30 అయ్యింది గురువుగారు
చంచల్ –7.30 అయ్యింది గురువుగారు
గురువు గారు – నేను ఈ రోజు నీకు
సంధ్యావందనం నేర్పుతానని చెప్పాను
చంచల్ - అవునండి
గురువు గారు – కానీ ఇది సంధ్యావందన సమయం కాదు. వేదపాఠం కూడా ముగియ వచ్చింది
చంచల్ – క్షమించండి గురువుగారు. ఈ విషయమై టైం గురించి నాకు అంతగా అవగాహన లేదు
గురువు గారు – పోనిలే, ఇంకా సమయం వృదాచేయడమేందుకు? నేను నీకు సంధ్యావందనం పద్ధతిని గూర్చి చెబుతాను. ఇంతకీ మీది ఏ శాఖ? (గోత్ర ప్రవర పరంగా మీది ఏ శాఖ?)
చంచల్ – తెలియదు గురువుగారు

గురువుల వారు చంచల్ ఇంటి పేరు ఇతర వివరాలు
తెలుసుకొని, నీవు యజుర్వేదీయ శాఖకు చెందినవాడివి కాబట్టి
నీవు యజుర్వేద సంధ్యావందనం నేర్చుకోవాలి అని అన్నారు.
అదే విధంగా యజుర్వేద సంధ్యావందనం పద్ధతిని సవివరంగా చంచల్
కి వివరించారు. దానికి సంబంధిచిన క్రియా ప్రతులనిచ్చారు.
చంచల్ తాను క్రితంరోజు మార్కెట్లో కొన్న
అరటిపళ్లను గురువుగారికి సమర్పించబోయాడు. దానికి గురువుగారు
బాబు నేను నా విద్యార్ధులనుండి ఏవిధమైన ప్రతిఫలాన్ని అంగీకరించను. ఇవి నీతోనే
ఉంచు అన్నారు అని సున్నితంగా తిరస్కరించారు.
చంచల్ ఆశ్చర్యపోయి దయతో స్వీకరించమని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాడు. దానికి గురువుల వారు – లేదు నాన్న! ఇవి మీ పిల్లలకి ఇవ్వు. నేను నా విద్యార్ధులనుండి ఏమీ స్వీకరించను అని అన్నారు. ఈ సారి గురువు గారి మాటలో గాంభీర్యం స్ఫురించింది. గురువు గారి మాట శిరసావహించడం చాలా ముఖ్యం.
చంచల్ ఆ అరటిపళ్ళను నిరుత్సాహంగా వెనక్కి తీసుకుని, ఈ విధంగా అడిగాడు

చంచల్ – గురువు గారు, నాదో సందేహం
అడగమంటారా?
గురువు గారు – అడుగు.
చంచల్ - శ్రీవిద్యకు, సంధ్యావందనానికి సంబంధమేమిటి? సంధ్యావందన అర్హతలేని వారు శ్రీవిద్య సాధనకు అనర్హులా? దయతో నా సందేహన్ని మన్నించి వివరించండి.
గురువు గారు- నిజానికి సంధ్యావందనానికి, శ్రీవిద్యకు తేడాలేదు. సంధ్యావందనంలో మూడు కాలాలలో అంటే ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలో త్రిపుటిగా సవితా దేవత ఉపాసన చేస్తారు. ఆజ్ఞా చక్రం మానవ శరీరంలో త్రిపుటి. నిజానికి ఆజ్ఞా చక్రం సంధ్య. ఇది ఇడా, పింగళా మరియు సుషుమ్నా నాడులు కలిసే కూడలి. ఈ ఆజ్ఞాచక్రం శ్రీవిద్య ఉపాసనలో చాలా ముఖ్యం. సవితా దేవత మరియు శ్రీవిద్య ఉపాస్య దేవత శ్రీమాతా ఇద్దరూ కూడా తేజో స్వరూపాలు.

ఇంకా శ్రీమాత బ్రహ్మాండమండల మధ్యస్థగా కొలవబడుతుంది. గాయత్రీ మంత్ర అర్థము
మరియు శ్రీవిద్యా మంత్ర (పంచదశీమంత్రం) ఒకటే. ఇంకా పంచదశీ మంత్రం ఒకసారి చేస్తే
మూడుమార్లు గాయత్రి మంత్రం చేసినట్లు అవుతుంది. ఈ విషయమై మరిన్ని వివరాలు తరువాత
చెబుతాను.
సావిత్రి ఆరు ఋతువులలో ఉపాసించబడుతుంది
అదే విధంగా శ్రీమాత మానవుని స్థూల శరీర షట్చక్రాలలో ఉపాసించ బడుతుంది.
గాయత్రి మంత్రంలో 24 బీజాలకు వ్యాహ్రుతి బీజాలను చేర్చితే మొత్తం 28 అక్షరాల మంత్రమౌతుంది. అదే విధంగా
శ్రీవిద్యలో మహాషోడశి 28 అక్షరాల మంత్రం.
గాయత్రి ఉపాసనలో స్థూల, సూక్ష్మ శరీరాలు
శుద్ధవుతాయి. అదేవిధంగా శ్రీచక్రపూజ కూడా, కానీ
విస్తారంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొందరు
ఈ సూక్ష్మమైన అంతర్గత విషయాన్ని
తెలుసుకోకుండానే, గురుపరంపర లేకుండానే, శక్తిపాతాను సారంగా మంత్రాన్ని పొందకుండానే
అంతర్జాలంలో దొరికే వీడియోల సాయంతో శ్రీచక్ర సాధన
చేస్తూ తమను తాము గొప్ప ఉపాసకులుగా భావించుకుంటున్నారు. అంతే కాక ఇతరులకు
నేర్పే ప్రయత్నం చేస్తున్నారు.
చంచల్ – అలా ఎందుకు గురువు గారు?
గురువు గారు – అదే మాయ. ఏదో ఓ చోట శ్రీచక్రపూజ చాలా మంచిది అని చదివి, ఈ పూజ వల్ల ఏవో గోప్ప ప్రాపంచిక భోగాలను గురించి విని, (పేరు, డబ్బు, స్త్రీ ఇత్యాదులనాశించి) వీటన్నికీ ఇది దగ్గరి దారి అని భావించి ప్రారంభిస్తారు. శ్రీవిద్య పరంగా ఉన్నట్టి వివిధ ఆచారాలు సాంప్రదాయాలను గూర్చి వారికసలు తెలియదు. వారికి సరిగా మార్గదర్శనం చేసే గురువు దొరకకుండానే శ్రీవిద్యోపాసన మొదలుపెడతారు. దొరకక అనడం కంటే కూడా సరియైన గురువును అన్వేషించకుండానే అనడం సబబు. ప్రతిదీ చిటికెలో జరగాలనే ఓ తాపత్రయం. వీరందరికీ కూడా వారి భౌతిక, లౌకిక విషయవాంఛలను గూర్చిన తాపత్రయమే తప్ప అంతిమ సత్యమైన ఆత్మానుభూతిని గూర్చిన తాపత్రయం ఉండదు. విచారకరమైనది ఏమిటంటే, వారు ఈ నిజాన్ని ఒప్పుకోలేరు. పైగా వారికి ఆత్మదర్శనమైనట్టుగా ప్రచారం చేసుకుంటారు కూడా. ఇదంతా ఓ గమ్యంలేని పిచ్చిప్రయాణం, తమను తామే ఈ మాయా కూపంలోకి తోసివేసుకోవడం.
సంధ్యావందనాన్ని ఆచరించని వారు కనీసం వారి తల్లిదండ్రులను, సూర్యభగవానుని ప్రార్థించాలి.

ఇంకా గురువులవారు చేపుతున్నారు...
చూడు నాయనా! సాధనలో తగిన సమయ పాలన
తప్పనిసరి. బ్రాహ్మీమూహుర్తంలో నిద్రలేవడం ( సూర్యోదయానికి 48
నిముషముల ముందు) బ్రాహ్మీమూహూర్తంలో
సాధన చేయడం చాలా ఉత్తమమం. ఈ సమయంలో సాధన చేసే సాధకుడు సాధనా ఫలితాన్ని తొందరగా
పొందుతాడు. దైవస్వరూపంగా మారతాడు.
చంచల్ – గురువు గారు, కొందరంటారు సాధన ఏ సమయంలో నైనా చేయచ్చని, ఇది నిజమేనా?
గురువు గారు - నిజమే, కానీ ఎవరికి? ఎవరికైతే చిత్తం శుద్ధి జరిగిందో వారికి. కానీ సాధన ప్రారంభంలో వేకువ గడియలలో(బ్రాహ్మీమూహూర్త) సాధన చాలా మంచిది, ముఖ్యంకూడా. కేవలం బద్ధకస్తులు మాత్రమే ఈ విధంగా కప్పి పుచ్చుకుంటారు. కానీ బద్ధకంతో చేసే సాధన ఫలిస్తుందా?

గురువు గారు - ఎందుకంటే మనకు చిత్తశుధ్ధి లేకపోవడం. శుద్ధి జరగని చిత్తం ఏకాగ్రతను, ధారణను పొందలేదు. ఎప్పుడూ వివిధ విషయాలవైపు మనస్సును పరిగెత్తిస్తుంది. నీవు జపం చేయడం ప్రారంభించిన తరువాత ఈ విషయం నీకు అర్థమౌతుంది. బ్రాహ్మీమూహూర్తం దైవముహుర్తం. బాగా గాఢమైన నిద్రను (సుషుప్తి దశ) అనుభవించేవారికి కొంత సమయం వరకు శరీరం, మనస్సు కొత్త ఉత్సాహంతో ఉంటాయి. అందువల్ల త్వరగా నిద్ర పోవడం, త్వరగా నిద్రలేవడం చాలా మంచి అలవాట్లు. సాధకులకు అవసరం కూడా. అంతేగాని, రాత్రి పన్నెండు, ఒంటిగంట దాకా పార్టీలని, పబ్ లని తిరిగి తెల్లారి ఎప్పుడో తొమ్మిదికో, పదికో నిద్రలేస్తే ఏం ఫలితం ఉంటుంది? రోగాలు తప్ప.

చంచల్ కి రాత్రి తమ పార్టీ సంగతి గుర్తుకొచ్చింది.
గురు సిద్ధ చెప్పసాగారు - ఒకసారి అంతః కరణ శుద్ధిపొందిన తరువాత సాధన
ఎప్పుడైనా చేయవచ్చు. ఈ విషాయలన్నీ ముందు ముందు నీకర్థమవుతాయి.
No comments:
Post a Comment