శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
-
శ్రీభువనానంధనాథులు
చంచల్ అంతఃకరణను గూర్చి, చిత్తశుద్ధిని గూర్చి
ఇంకా తెలుసుకోదలచి ఈ విధంగా అడిగాడు
చంచల్
: గురువు గారు, చిత్తం మనస్సు రెండు ఒకటేనా?
గురువు
గారు : కాదు రెండు వేరు వేరు. అంతః కరణములు మొత్తం నాలుగు. అవి మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారం. సాధనలో అంతఃకరణ శుద్ధి చాలా ముఖ్యవిషయము.
సాధన
గురు పరంపరాగతమైన గురువుల అనుజ్ఞానుసారం సాగవలసిన సాధన.
వీడియోలు గట్రా చూసి సాధన ప్రారంభిస్తే ఆధ్యాత్మిక పురోగతి లేకపోగా వ్యతిరేఖ
ఫలితాలు పొందవలసి వస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి గురువులు చూపించిన బాటలో
నడిచినపుడే చూడగలరు.
చంచల్
: గురువు గారు, సంధ్యావందనం శ్రీవిద్య రెండూ ఒక్కటే అయినపుడు మరి
శ్రీవిద్యోపాసనా పరులకు సంధ్యావందనం ఎందుకు?
గురు
సిద్ధులు : చాలా మంచి ప్రశ్న. సంధ్యావందనం అర్హత అందరికి లేదు కానీ
శ్రీవిద్యార్హత అందరికీ ఉంది. కుల, మత,
లింగ భేదం లేకుండా అందరూ శ్రీవిద్యోపాసనకు అర్హులే.
శ్రీవిద్యాసాధన సద్గురువుల ఉపదేశానుసారం ఎవరైన చేయవచ్చు. గురుఉపదేశం తప్పని సరి.
అదే సంధ్యావందనం వైదిక ధర్మం. అర్హులైన వారు తప్పక చేయవలసిన
నిత్య కర్మ. గాయత్రిని పరాశక్తి అని కూడా అంటారు. గాయత్రీ మంత్రం ప్రకట గాయత్రి
కానీ అర్హులకు మాత్రమే ఉపాసించ వలసినది. పంచదశి అప్రకట
గాయత్రి కానీ సద్గురువు ద్వారా పొందవలసినది. శ్రీమాతను సంధ్యా సమయాలలో గాయత్రిగా ఉపాసిస్తే రాత్రివేళ
శక్తిగా ఉపాసించబడుతుంది. శ్రీవిద్యను చంద్రవిద్య అని కూడా అంటారు.
ఒక
సైన్స్ విద్యార్థిగా నీకు సూర్యునికి, చంద్రునికి గల సంబంధం తెలుసు కదా?
జీవుని బుద్ధి సూర్యోదయంతో వికసిస్తుంది. వికసించిన బుద్ధే అమృతతత్త్వాన్ని ఆస్వాదించగలదు. అమృతత్త్వం రాత్రులందు అనుభవమౌతుంది.
ఎవరైతే
మా బుద్ధులను ప్రేరేపిస్తున్నారో వారికి నేను నమస్కరిస్తున్నాను అని గాయత్రి మంత్రము యొక్క భావము. శ్రీవిద్య, అంతిమ లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారనిచ్చే విస్తారమైన ప్రక్రియ. శ్రీవిద్య తాంత్రికమైతే,
సంధ్యావందనం వైదికం. తాంత్రిక పద్ధతులు తగు జాగ్రత్తతో,
గురువుల పర్యవేక్షణలో సాధన చేయాలి.
లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే సంధ్యాసాధన సాధకుని తగిన విధంగా రక్షిస్తూ సాధనా మార్గంలో ముందుకు నడిపిస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః అంటే ఇదే
చంచల్ కి గురువు గారి మాటలతో కొత్త ఉత్సాహం కలిగింది. ఆహా ఎంత చక్కని అనుభవం అనుకుని గురువు గారి అవ్యాజ్యమైన ప్రేమకు పొంగిపోతూ తన అదృష్టానికి ఎంతో ఆనందపడ్డాడు.
ఇంతలో...
మేని వర్చసుతో వెలిగిపోతున్న తేజస్సు కలిగిన ఒకతను గురువు గారి దగ్గరకు వచ్చి వారి
పాదాలకు నమస్కరించాడు. గురువుగారతన్ని దీవించాడు.
గురు సిద్ధులు : ఎలావున్నావు పూర్ణ? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా క్షేమమేనా? నీ సాధన ఎలా సాగుతుంది?
పూర్ణ
: అంతా అమ్మ, అమ్మరూపమైన మీ దయ గురువు గారు అని బదులిచ్చాడు.
పూర్ణ
తాను తీసుకొని వచ్చిన అరటిపళ్లు గురువు గారికి సమర్పించాడు. గురు
సిద్ధులు వాటిని పూజగదిలో ఉంచమని చెప్పారు.
ఈ
పరిణామానికి చంచల్ ఒకింత విస్మయం కలిగింది. గురువుగారు పూర్ణ ఇచ్చిన పళ్లు స్వీకరించి నేనిస్తే
ఎందుకు తిరస్కరించారని అడగాలనుకున్నాడు కానీ అడగలేక పోయాడు.
చంచల్ : గురువు గారు శ్రీవిద్యదీక్షా పద్ధతులేమిటి? పాటించ నియమాలేమిటి?
అందుకు గురువు సిద్ధులు ఈ విధంగా చెప్పనారంభించారు
ఇంకావుంది...........
No comments:
Post a Comment