SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Saturday, April 22, 2017

ఆసనసిద్ధి

సాధనలో ఆసనం,ఆసనసిద్ధి ఎంతో ముఖ్యం, ఆసనసిద్ధి అంటే ఒకే ఆసనంలో సంపూర్ణ సౌఖ్యంతో ఉండగలగడం, ఎన్ని గంటలైనా కదలకుండా వీలైనంత అన్యధ్యాస లేకుండా కూర్చోగలగడమే ఆసన సిద్ధి.  ఆసన సిద్ధి లేకుండా సాధన సాగదు. మంత్ర సాధనలో ఆసనసిద్ధి చాలా ముఖ్యం, ఆసనసిద్ధితో మంత్రసాధన మనస్సుయొక్క చాంచల్య స్వభావం కట్టివేసి మానసిక స్థితికి నిలకడనిస్తుంది, మానసిక వృత్తులు అన్ని ఒకచోట చేరినప్పుడు బీజక్షరములతో కూడిన మంత్రమును పలు మార్లు జపించుట చేత శక్తి ఉద్భవిస్తుంది,మంత్రబీజాక్షరాలనుండి ఉద్భవించే అపారమైన శక్తితో మనస్సు వశమౌతుంది. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి.
ఆసనం అంటే
                                        ఆత్మసిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం|
                                        నవసిద్ధి ప్రదానాశ్చ ఆసనం పరికీర్తితం||


 ‘’ అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తూ, ‘’ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం.  

సిద్ధిని పొందగోరే వారు చేసే అన్ని ఉపాసనలకు కూర్మాసనం ప్రధానం. నూలు వస్త్రం పై ఈ కూర్మాసన మండలాన్ని నిర్మించి మంత్రం జపం చేేస్తే  అలసత్వాన్ని తొలగించి ఆసనసిద్ధితో మంత్రసిద్ధి కలుగుతుంది.






No comments:

Post a Comment