SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, April 26, 2017

సాధన పంచకం - సాధనా మార్గం

సాధనాపంచకం - 2


సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః వరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్ విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరోవాక్యంస మాకర్ణ్యతామ్ !!

  
సజ్జనులతో కలిసి ఉండుము, భగవంతుని యందు ధృఢమైన భక్తిని కలిగి యుండుము.
శాంత్యాది గుణములను ఆశ్రయించుము. కామ్య కర్మలను విసర్జించుము. సద్ విద్వాంసులను ఉపాసింపుము  వారి పాదుకలను ప్రతి దినమూ సేవింపుము. బ్రహ్మ ప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మ మంత్రమైన ఓం కారమంత్రమను సేవించుము, ఉపాసించుము. శ్రుతి శిరస్సులైన ఉపనిషత్ వాక్యములను వినుము


No comments:

Post a Comment