SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Sunday, April 30, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-1




శ్రీగురుభ్యోనమః

                                              సదా శివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం,

                                              అస్మదాచార్య  పర్యంతాం వందే గురు పరంపరాం





శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)

- శ్రీభువనానంధనాథులు

1


ది శాస్త్రవచము కాదు. వేదభాగం అంతకన్నాకాదు. ఇది శ్రీవిద్యా సాధనకు సంబంధించిన చర్చ మాత్రమే. ఈ శీర్షికలో  ఒక విషయము నుండి మరియొక విషయము అంతర్గత భావానికి భంగం కలిగించకుండా ముందుకు సాగుతుంది. ఈ శీర్షికలో కపటంగానీ, సంధర్భానుకూల వ్యవహారం గానీ లేవు, కేవలం నిజాలు మాత్రమే.  ఇది సత్యాన్వేషణ చూట్టూ తిరిగే సత్యవిషయ సమీకరణ. సాధనా మార్గంలో కలిగే సందేహాల నివృత్తి సంకలన క్రోడీకరణ.
సాధన అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? సాధనయొక్క ఫలితాలేమిటి? దాని పర్యవసానంగా భగవత్ ఉనికిని గ్రహించడం లాంటి విషయాలను గురించి ఇక్కడ స్పృశించడం జరిగింది.
ఇది నా కథ కాదు. సాధనకు సంబంధించిన దశ, దిశను నిర్ధేశించే కథాంశంలో నాకు కలిగిన అనుభవాలను జోడించిన కూర్పు మాత్రమే అని పాఠకులు గమనించగలరు.
దేవుడు...! దేవుడు...!! దేవుడు...!!!
దేవుడున్నాడా? ఉంటే ఎవరు? ఎక్కడున్నాడు? ఎక్కడో ఒక దగ్గర వుంటే ఎవరతన్ని చూసారు? సామాన్యంగా దేవుడంటే  విఘ్నేశ్వరుడు, కృష్ణుడు, దుర్గా, శ్రీరాముడు, జీసస్, అల్లా ..... అనికొందరు,  అనిర్వచనీయమైన శక్తి అని ఇంకొందరు,  వీరందరి కంటే ఉన్నత స్థితిలో ఉన్న వారు నేను, నీవు, మనమంతా కూడా దేవులమే- అహంబ్రహాస్మి అని అంటారు.
మొదటి వర్గం వారు భక్తులు, రెండవ రకంవారు సాధకులు మరి మూడవ తరగతి వారు యోగులు.
మరి భగవత్ తత్త్వాన్ని గూర్చి వీరిలోని సారుప్యము , వ్యత్యాసము ఏమిటి?
వీరందరిలో సారుప్యత అంశం ఎమంటే... ఎవరు కూడా నడిచి వచ్చిన దేవున్ని చూడలేదు. ఇది నిజం కాదా? కాదని ఎవరైనా అంటే అది శుద్ధ అబధ్ధం మరియు వారిని వారే మోసం చేసుకోవడమే.  సాధనలో స్వప్న దర్శనాలు కలగవచ్చు. ఆ స్వప్న దర్శనాలను బట్టి దేవుని రూపమును కొందరు కల్పించుకున్నారు. నిజానికి స్వప్న దర్శనాలు తమ మనసు చిత్రీకరించిన భావాలు మాత్రమే. కాని, మహానుభావులైన మన ఋషులు ఎంతో సాధన ద్వార పరమాత్ముని దర్శించి ఆ రూపములను మనకు అందించారు. అవే మనకు ఇప్పుడు ధ్యాన శ్లోకాలు. స్వప్న దర్శనాలను గూర్చి ఈ శీర్షికలో ముందుముందు వస్తుంది.
భక్తనిగా ప్రస్థానం ప్రారంభించి యోగిగా మారడమే సాధన. భక్తుడి జీవితంలో క్షణికావేశ అల్ప సంతోషముంటే, యోగి జీవితమంతా అనంతమైన శాశ్వతమైన సంతోషమేవుంటుంది.
కారణం భక్తుడు సాధనలో తనకు కలిగిన చిన్న అనుభవపు తుంపరలను జలపాతంలా భావించి, ఢాంబికాన్నిప్రదర్శించడం. ఇదే సాధనను ముందుకు సాగనివ్వని మాయ అనే సాలేగూటిలో చిక్కడం. భక్తునిగా, సాధకునిగా రెంటికీచెడ్డ రేవడవ్వడం.
ఇలా ఎందుకు జరుగుతుంటే దానికి కారణం రజోగుణం మరియు తమో గుణం. ఈ గుణాల గురించి కొంచెం తెలుసుకుందాం.
మన ఆలోచనలు రెండు రకాలు. అవి సానుకూల ఆలోచనలు మరియు ప్రతికూల ఆలోచనలు. సానుకూల ఆలోచనలకు మూడు విధములక్షణములు – సానుకూల అంశాల గూర్చి సానుకూలంగా స్పందిచడం, కామ, క్రోధ, లోభ, మోహాలను గూర్చి సానుకూలత ప్రదర్శించడం, మరియు సోమరితనం, నిద్ర విషయాల్లో సానుకూలత. అంటే మనం చేసే విషయాలన్నీ మనకనుకూలంగా ఆలోచించుకోవడం, స్పందించడం. రజో, తమో గుణాలు లేని స్థాయినే సత్త్వగుణము అని అనంటారు.
ఉదాహరణకు కామం విషయంలో దాదపుగా ప్రతి ఒక్కరి ఆలోచనాకూడా అతిగా, మితిమీరినదిగా, అత్యాశతో, అవకాశవాద దోరణి కలిగివుంటుంది. ఇది నిజమని ఎవరు పైకి ఒప్పుకోకపోయినా వారి మనసుకి అసలు నిజం తెలుసు. కామం విషయంలో ఇదీ సానుకూల ఆలోచనే. ఇదే సూత్రం క్రోధ,లోభ,మోహాలకూ వర్తిస్తుంది.
మరోవిధంగా చేప్పాలంటే, రాత్రి పడుకునే ముందర పోద్దున్నే బ్రాహ్మీమూర్తంలో ( సూర్యోదయానికి 48 ని.ల ముందు కాలము)పూజ చేయడానికి నిద్ర లేవాలని గట్టిగా అనుకొని, అలారంకూడా పెట్టుకుని తీరా ప్రోద్దున అలారంమ్రోగే సరికి పూజను దేవునికొదిలి, మరి కాసేపు నిద్రపోవడం కూడా ఓ విధమైన సానుకూల స్పందనే. ఇది మూడో రకం సానుకూల స్పందన.
మొదటి రకపు సానుకూల స్పందన సత్త్వగుణం కలిగినది. రెండవ రకపు సానుకూల స్పందన రజోగుణం కూడినది, మూడవ రకపు సానుకూల స్పందన తమోగుణ ప్రధానమైనది.
రజోగుణానికి ప్రతీక మహిషాసురుడు (మహిషాసురుడు విపరీత కామానికి ప్రతీక, మనిషికీ, దున్నపోతుకు పుట్టినవాడు) బండాసురుడు తమోగుణానికి ప్రతీక.
సాధారణ మానవుల మనసులు ఎప్పుడూ ఈ రజో, తమో గుణాలతోనే ఆవరించబడి ఉంటాయి. సరియైన శిక్షణ లేని సాధన ఈ రజోగుణ, తమోగుణాల మద్య ఊగిసలాడుతుంది. ఎవనికైతే పరతత్త్వాన్ని తెలుసుకోవాలన్న జిజ్ణాస ఉంటుందో వారిలో ఈ రజో, తమో గుణాలని నిలువరించి, ప్రాలదోలడానికి కావలిసిన యుద్ధం మొదలవుతుంది. అదే భండాసుర, మహిషాసుర మర్ధనం. నిజానికి సత్త్వగుణాన్ని సాధించకుండా సాగే సాధన ముందుకు ఎలా సాగుతుంది? ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి ఎలా వస్తుంది? ఇది ఎంతో జాలి పడాల్సిన స్థితి! మరి సాధనలో ముందుకు సాగడానికి ఏమి చేయాలి?


ఇంకావుంది......
 

1 comment: