SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Tuesday, April 25, 2017

సాధన పంచకం - సాధనా మార్గం

శ్రీగురుభ్యోనమః

జయ జయ శంకర హర హర శంకర


శ్రీ శంకర భగవత్ పాదులు రచించిన సాధన పంచకము సాధనా మార్గసోపానాలను వివరించి సాధనా మార్గంలో మనలను ముందుకు నడిపించారు, కానీ నేటి జీవన విధానానికి వారి బోధలను అర్థంచేసుకుని, ప్రస్తుత జీవనవిధానానికి అన్వయించుకుని అర్థమయ్యే విధంగా, సాధనపథంలో ముందుకు నడిపించే రసరమ్య కథాస్రవంతి ...... అస్మద్ పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ భువనానంధనాథులు మా కోరిక మన్నించి మన కోసం అదించిన సాధనా సోపానాలు..... శ్రీవిద్యాస్ఫురణ గా మన ముందుకు..... 
  
నేటి నుండి శ్రీశ్రీ శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాదవిరచిత సాధన పంచకమ్ స్మరించుకుని

ఈ శంకర జయంతి నుండి శ్రీ భువనానంధనాథుల వారి శ్రీవిద్యాస్ఫురణ.... మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, సాధనలో ముందుకునడవడానికి 
 


  సాధనాపంచకం -1

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం

తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్తజ్యతామ్ !

పాపౌఘః పరి ధూయతామ్ భవసుఖే దోషోనుసన్ధీయతాం

ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !!


ప్రతిదినము వేదాధ్యయనము చేయవలెను, అందులో చెప్పిన కర్మలు శ్రద్ధగ ఆచరించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజగా మారును గాక! కామ్య కర్మలను త్యజింపుము నిష్కామ కర్మలను చేయుము. పాపములను బోగొట్టుకొనుము. సంసార సుఖములోగల దోషముల నెరుగి జీవితమును అనుసంధానము చేసుకొనుము. ఆత్మ జ్ఙానము నందు ఇచ్చమును పెంపొందించుకొనుము. శీఘ్రమే నిజ గృహమునుండి వెడలుము.
 

No comments:

Post a Comment