సాధనాపంచకం - 4
క్షుద్
వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నంనతు
యాద్యతాంవిధివశాత్ ప్రాప్తేనసంతుష్యతామ్ !
శీతోష్ణా
విసహ్యతాం స తు వృథావాక్యం సముచ్చార్యతాం
ఔదాసీస్యమభీప్స్యతాం
జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !!
ఆకలి దప్పిక అను
వ్యాధులకు చికిత్స కావింపుము. భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరమగు
భోజనపదార్థములను యాచింపక, విధివశాత్
లభించిన దానితో తృప్తిని పొందుము. చలి, వేడి వంటి ద్వంద్వములను
తితిక్షాబుద్ధితో సహింపుము. అనవసర ప్రసంగములు,
అనవసర మాటలాడకుము. ఔదాసీన్యమును వహించుము. లోకుల యెడ నైష్ఠురడవు కాకూడదు.
No comments:
Post a Comment