SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, May 10, 2017

ఛిన్నమస్తికా దేవీ

నేడు ఛిన్నమస్తిక దేవి జయంతి సందర్భంగా.....

'మస్తిక'  అంటే శిరస్సు  అని, 'చిన్'  అంటే లేదు అని, శిరస్సు లేని దేవత....
జమదగ్ని రేణుఖా దంపతులకు కుమారుడైన పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత.  
                                                       
                                      ఛిన్నం శిరం కీర్ణం కచం దధానాం
                                       కరేన కంఠోద్గత రక్త ధారాం !
                                       రామాంబికాం దుర్జన కాళ రాత్రీం
                                       దేవీం పవిత్రాం మనసా స్మరామి !!


అని వాసిష్ఠ  గణపతి మునీంద్రులు ప్రచండ చండి అవతారమగు రేణుకను గానం చేసి ఉన్నారు.  


పురాణాల  ప్రకారం  మార్కండే పురాణం లో ఒక గాధ ప్రచారంలో వుంది. చండి దేవికి రాక్షసులకి జరిగిన ఘోర యుద్ధం లో చండి దేవి అసురుల్ని ఓడిస్తుంది.  అందులో సాయపడిన   ఢాకిని, యోగిని గా పిలువబడే జయ విజయులు ఏంతో మంది రాక్షసులని  సంహరించి వారి రుధిరాన్ని తాగుతారు. కాని,  యుద్దానంతరం కూడా వారు విపరీతమైన  రక్త దాహంతో వున్నపుడు చండి దేవి  తన తలని తానే ఖండించి తన శరీరం నుంచి వచ్చే రక్త ధారలతో వారి దాహాన్ని తీరుస్తుంది.



శక్తి ఉపాసకులైన శక్తేయులు, తాంత్రికులు ఆరాధించే దశ మహావిద్యలలోని దేవత ఛిన్నమస్తిక,ఛిన్నమస్తిక  ప్రచండచండిక మరియు సర్వానంద ప్రదాయిని, స్వీయఖండనం అంటే మోక్షమార్గ అడ్డంకమైన మయాను తొలగించుకోవడం, కుండలిని సిద్ధికి చిహ్నంగా సూచించబడుతుంది.
మూలాధారము నుండి సుషుమ్నా పథగామియై గ్రంధి భేధనం చేసుకుని సహస్రారాన్ని చేరడంతో ఆ తాకిడితో శిరో చేధనం జరగడాన్ని సూచిస్తుంది.
ఛిన్నమస్తిక దేవి  అనుగ్రహం వల్ల కుండలినీ సాధకునికి యోగసిద్ధి త్వరితంగా సిద్ధిస్తుంది,

దశమహావిద్యా తంత్రంలో 'వజ్రయోగినీ ఛిన్నమస్త', శ్రీలలితా సహస్రనామాలలో  "వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జితా" అనే నామం ఛిన్నమస్తిక సూచకం, దేవీ ఉపాసనలో వజ్రయోగినీ సాధన తో మహాసిద్ధి లభిస్తుందని.


ఛిన్నమస్తికా దేవీ  అందరి బాధలు, కష్టాలు తొలగిస్తుంది కనుక ప్రజలు చింత పూర్ణికగా పిలుస్తారు ఈ పూర్ణిమ ఛిన్నమస్తిక దేవి జయంతి.

No comments:

Post a Comment