SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Sunday, May 21, 2017

శ్రీవిద్యా ప్రస్థానం - 5

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

5



త శీర్షికలో సాధనకు కాలసిన ప్రాధమిక అర్హత తృష్ణ, తపన అని తెలుసుకున్నాం. అయితే భగవంతుని గురించి పెద్దగా ఆలోచించని వ్యక్తి, ఇలాంటి తపన లేని మనుషులు ప్రాపంచిక బంధాలు, భాదలతోనే కాలం వెల్లదీస్తారు. కానీ భగవంతుని పై నమ్మకం, తపన ఉన్నమనుషు మనస్సులో  తప్పక ఎప్పుడో ఒకసారైనా తామనుభవిస్తున్నఈ భౌతికజీవనాన్ని గూర్చి, తమ జీవన పయనాన్ని గూర్చి ఆలోచిస్తారు. ఈ రకమైన ఆలోచనలు బీజమై అవి కాస్తా పెద్దవౌతాయి. ఇది నిజంగా మన పూర్వజన్మ సుకృతం. తెలిసినంతలో ఆధ్యాత్మిక గూర్చి ఆలోచనలు మరులుతాయి. ఈ విషయ ఙ్ఞానమున్న వారితో గాని లేదా వివిధ రకాలుగా గాని విషయసేకరణ చేస్తారు. మనస్సులో ఈ ఆధ్యాత్మికతను గూర్చిన ఉత్సుకత పెరిగుతుంది. కానీ ఏమి చేయాలో ఎలా ప్రారంభించాలో తెలియని నిస్సహాయతలో, తనకు తెలిసిన దారులలో వెదుకులాట సాగిస్తూనే ఉంటారు. స్వాముల చూట్టూ బాబాల చూట్టూ తిరిగి అవేవి తనను తృప్తి పరలేనపుడు, మళ్ళీ మళ్ళీ తిరిగి తన ప్రయత్నం మొదలెడుతూనే ఉంటారు. తన ప్రయత్నం ఫలించని ప్రతిసారి తనలోని ఆధ్యాత్మికతను గూర్చిన తపన తీవ్రమౌతుంది. ఈ విధమైన పట్టుసడలని తన ప్రయత్నంలో దో ఓ మంచిరోజు భగవంతుని అనుగ్రహంతో తన జీవితం మలుపుతిరుగుతుంది. ఓ సారి లంకలో సీతమ్మ వారి కోసం హనుమంతుల వారు వెదికి సందర్భం గుర్తుచెసుకుంటే, మొదట హనుమంతులవారు వెదుకడం మొదలుపెట్టి లంకలో ఎన్నో ప్రదేశాలలో గాలించి గాలించి చివరకు భవంతుని శరణువేడుతారు. అప్పుడు తన ప్రయత్నం సఫలమౌతుంది. ఇదే దైవబలం. దైవబలంతో తిరిగిన మలుపు జీవితానికే మేలి మలుపు. దైవబలానికి మించినది మరోకటిలేదు ఉండదు.

ఇలాంటి ఆధ్యాత్మిక తపన, దైవబలమున్న వ్యక్తి చంచల్. జీవితం మలుపుదిరిగిన క్షణాన శ్రీసిద్ధుల వారిని దర్శించ వారింటికి వెళ్ళాడు. అక్కడి నుండి చంచలుడి ఆధ్యాత్మిక ప్రస్థానం తన గురువు సిద్ధుల వారి చూపిన మార్గంలో ఎలా సాగిందో చూద్దాం.

చంచల్, గురువు సిద్ధుల ఇంట్లోకి ప్రవేశించేసరికి, గురుగారు తన శిష్యులకు వేదాలు భోదించడంలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో చంచలుడుకి అక్కడేమి జరుగుతుందో అర్థమవకుంది. చంచలుడు వారంతా సిద్ధులవారి శిష్యులని అనుకుని నిశ్శబ్దంగా ఓ పక్కగా కూర్చన్నాడు. అంతలో తన చరవాణి(సెల్ ఫోన్) బిగ్గరగా మ్రోగింది. సిద్ధుల వారు తన పఠనాన్ని అపి చంచలుని వైపు ఒక సారి చూచి తిరిగి ప్రారంభించారు. దీంతో చంచలుడు తన మూర్కత్వానికి తనను తాను తిట్టుకుని, చరవాణి(సెల్ ఫోన్) స్విచ్చాఫ్ చేసుకుని కూర్చున్నాడు. వేదమంత్ర ఘోషలో చంచలుడి మనస్సు కాస్త ప్రశాంతతను పొందింది. అక్కడి వేదమంత్రాలతో కూడిన ఆ వాతావరణంలో చంచలుడు మైమరిచి పోయాడు. "ఎవరు బాబు నువ్వు?" అనే సిద్ధులవారి ప్రేమ పూరిత గంభీరమైన స్వరంతో చంచలుడు తేరుకుని ఈ లోకంలోకొచ్చాడు. శ్రీ సిద్ధుల వారి వైపు చూసి వారినేమని సంభోదించాలో అర్థంకాక వారికేమని చెప్పాలో తెలయలేదు. ఎందుకంటే తనేమి శంకరాచార్యుల వారు కాదు అహంబ్రహ్మాస్మీఅని చెప్పడానికి, మరేమో గణపతి ముని కాదు అతనే తన గురువని గుర్తించడానికి. అతనో సామాన్యమైన ఇంజనీరు. ఆధ్యాత్మిక ఓనమాలు రాని సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అతనిలా చెప్పడం ప్రారంభించాడు.
చంచలుడు-  సార్, నా పేరు చంచల్
సిద్ధులవారు- అలాగా ఏమి  కావాలి ?
చంచలుడుకి ఒక్కసారిగా సిద్ధుల వారిడిగిన దానికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు. కానీ అతనికి తెలిసినది, అర్థమైనది మాత్రం ఎదురుగా ఉన్న వ్యక్తి మాత్రమే తనకు సహాయంచేయగలడని. కానీ ఎలా చెప్పాలో ఎలా మొదలుపెట్టాలో తెలియడంలేదు, అంతలో 
సిద్ధులవారు- చెప్పు బాబూ ఏమి కావాలి?
అప్పుడు చంచలుడు చిన్న స్వరంతో మొదలెట్టాడు ఇలా.....
చంచలుడు- సార్,  నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకే తెలియదు. కానీ ఇప్పటి వరకు నా జీవితం డబ్బు వెంట స్త్రీల వెంట పరిగెత్తేది. గత కొన్ని రోజుల నుండి వీటిపై నాకు పెద్దగా ఆసక్తి కలగడంలేదు. నా వద్ద సరిపడే డబ్బుంది. భార్య, పిల్లలున్నా కూడా ఇతర స్త్రీల వెంట పరిగెత్తే వాన్ని. నేను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. అయినా ఎదో వెలితి నాకు తృప్తి లేకుండా చేస్తోంది. ఇబ్బంది పెడుతుంది. ఇంకా దో (తపన) తెలియని అలజడి నా మనస్సు ను తొలుస్తోంది. కానీ భౌతిక వసరాలు నా ఈ తపనను కప్పేస్తున్నాయి. దాంతో ఈ అవసరాల  వెంట పరిగెడుతున్నాను. ఈ (తపన ) తెలియని అలజడి రోజు చివనో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సును తాకుతుంది. అప్పుడు మళ్ళీ నాలో నా జీవితగమనం గూర్చి నా మనస్సు నడవడికను గూర్చి కొన్ని క్షణాలు విమర్శనాభావంలో నిండిపోతోంది. కాని, పేపరులో అమ్మాయి బొమ్మ కనపడగానే మళ్ళీ వెంటనే రా మాములై పోతోంది. అది తప్పు అనే భావన నాలో ఉన్నాకూడా, నా నిస్సహాయత్వం నాలో కలిగే తెలియని అలజడిని కప్పేస్తోంది. కుక్క తోకమాదిరిగా ఆయిపోయింది నా మనస్సు పరిస్థితి.
ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని సార్లు ఏడుస్తాను. ఇంకేమి మళ్ళీ మనస్సు పార్టీవైపు ఎగేస్తుంది. ఇది కాదు నిజమైన జీవనం అని తెలిసికూడా ఏమి చేయలేని నిస్సహాయత ఆవహించివుంది. ఇంకా నా మానసిక పరిస్థితిని, గంరగోలాన్ని సరిగా వివరించలేకున్నాను. కానీ మీ సహాయం కావాలి, నా పై దయుంచి నన్ను అనుగ్రహించండి.
సిద్ధులవారు- దానికి నేనేం చేయగలను? ఎవరైన మించి వైద్యుని సంప్రదిస్తే మంచిది కదా?  నేనేం డాక్టరిని కాదు కదా.. ?
సిద్ధుల వారి మాటలకు చంచలుడి కళ్ళు చీకట్లు కమ్మాయి, మనసంతా శూన్యం ఆవహించింది
అంతలో సిద్ధువారి వద్దకు ఒకతనొచ్చి వినయంగా మంద్రస్వరంతో గురువు గారు హోమానికి అన్ని సిద్ధంగా వున్నాయి. అని చెప్పాడు, దానికి సిద్ధులవారు సరే అన్నట్టుగా తలాడించారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనకు జీవితంలో ఎదురైయే అనుభవాలు, సంఘటనలే మనకు దారి చుపుతాయి. అంతటి మానసిక స్థితిలో చంచలుడికి తన ముందు జరిగిన సంఘన ఊతమైంది. గురువు....అవును గురువుగారు... అతనే నా గురువులు. ఆ క్షణంలో వారి పాదాలనాశ్రయించాలనే అలోచన రావడమే తరువాయి వారి దివ్యపాదాపై వాలిపోయి...
గురువు గారు మీరే నా వైద్యులు. నా మానసిక స్థితిని చక్కబెట్టగలిగిన వారు. మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. ఎందుకంటే మీ సన్నిదిలో నాలో నాకు దో తెలియని ప్రశాంత కలుగుతోంది. దాన్ని మించి మనస్సెంతో ఉత్సాహంతో నిండి పోయింది. ఇలాంటి ఆనందాన్నింత వరకు నేననుభవించలేదు. భగవంతుని అనుగ్రహాన మీ దర్శనభాగ్యం కలిగింది. కాదనకుండా నన్ను అనుగ్రహించండి, నాకో దారి చూపండి.
చంచలుడి నిర్మలమైన ఆరాధనపూర్వక అభ్యర్థనతో సిద్ధులవారు అతనితో లే నాయన... లే.. అని ఆప్యాయతనిండిన స్వరంతో అతని భుజం తట్టారు. వారి చరణ స్పర్శతో విద్యుత్ ప్రవాహంలాంటి స్పంన చంచలుడిలో కలిగింది. నెమ్మదిగా వారి పాదాలునుండి పైకిలేచి వారి దివ్యచరణాల వంక చూసాడు... సిద్ధులవారి సైతం కొన్ని క్షణాలు చంచలుడి వైపు తన దయా వీక్షణాలనుగ్రహించారు.
ఈ సంఘటను పరిశీలిస్తే..
ఇందులో దైవబలం, తపనతో కూడిన తృష్ణ అన్నింటికీ మించిన గురుభక్తి (గురువు గారిని సంభోదించడంలో సాంప్రదాయ మర్యాదలు పాటించాలి) ముఖ్యం అని అర్ధమవుతుంది కదా!
అంతలో గురువుగారు అడిగారు
గురువుగారు – అయితే నీవు నా దగ్గర విద్యార్థిగా చేరతావా? లేదా శిష్యుడిగానా?
గంరగోళం .....మళ్ళీ గంరగోళం
రెంటికీ తేడా ఎమిటీ?..... అని చంచలుడి మదిలో ఆలోచన

ఇంకావుంది..............

 

No comments:

Post a Comment