శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
-
శ్రీభువనానంధనాథులు
చంచలుడు ఆత్రుత నిండిన ఆలోచనా
మనస్కుడై ఇంటికి వెళ్ళాడు. అతడి ఆలోచనలన్నీ ఇలా సాగాయి- రేపు నా జీవితంలో చాలా
ముఖ్యమైన రోజు. త్వరగ పడుకొని వేకువగా నిద్రలేవాలి. అలాగే నా సంధ్యావందనం పుస్తకం ఎక్కడుందో వెతికి పెట్టుకోవాలి. బహుశా అది నా పూజ గదిలోవుండి వుంటుంది. లేదా వెతకమని ఆకర్షకి చెప్పాలి (
ఆకర్ష చంచలుడి భార్య). గురువుగారు నాకు సంధ్యావందనం బదులు శ్రీవిద్యా ఉపాసన నేర్పితే బాగుండేది కదా! పోనిలే, సంధ్యావదనంతోనే
మొదలెడదాంలే. ఓ రెండురోజులు పోయిన తరువాత శ్రీవిద్య నేర్పమని
అడుగచ్చు. నాకుతెలిసినంత వరుకు శ్రీవిద్యోపాసకులకు గొప్పఅతీత
శక్తులొస్తాయి. నాక్కూడా ఆశక్తులు వస్తాయి. నేను వాటితో ఈ
ప్రపంచాన్నే మారుస్తా. నేను కూడా ఓ ఆశ్రమాన్ని ప్రారంభించి
అందరికి శ్రీవిద్యనేర్పించే బాబానైపోతా. నేనెంత అదృష్టమంతుడ్ని. నాకు ఇలాంటి గురువు దొరకడం…. శ్రీవిద్య లభించడం….. ఈ సమాజంలో మా ఆఫీస్ లో కూడా నేను చాలా శక్తిమంతుడినై పోతాను. ఈ శక్తులతో
అందరినీ నిగ్రహించవచ్చు. నా చెప్పుచేతల్లో పెట్టుకునవచ్చు.
ఛీ అనవసరంగా ఇంతవరకు నా సమయమంతా పాడుచేసుకున్నాను. గురువుగారి ఆశ్రమం మాకింత
దగ్గరలోనే వుండి కూడా ఇన్నిరోజులు వారిని కలవకున్నాను. ముందే కలిసుంటే ఎంత బాగుండేది. ఇప్పటికి చాలా ప్రగతి సాధించివుండే వాడిని.
అంతలో అతడు ఓ పళ్ళమార్కేట్ దాటుతుండగా ఆలోచన
వచ్చింది పిల్లలను, గురువులను, తల్లిదండ్రులను ఇంకా పెద్దల వద్దకు ఉత్తచెతులతో వెళ్ళోద్దంటారు
అని. ఏవైనా
పళ్ళు కొందామని ఓ దుకాణంలోకి వెళ్ళాడు.
చంచల్- అపిల్స్ ఎలా ఇస్తున్నావు?
పండ్లవాడు- కిలో రెండువందలు.
చంచల్- అమ్మో ... రెండువందలా? అనుకుని దానిమ్మెంత? అడిగాడు.
పండ్లవాడు- రెండువందల యాభై
చంచల్- అంత రేటా? సరే కానీ అరటి పళ్ళు
చంచల్- అంత రేటా? సరే కానీ అరటి పళ్ళు
పండ్లవాడు- డజను యాభై
చంచల్- ఎక్కువ చెపుతున్నావు, నలభై చేసుకొని డజను
అరటి పళ్ళు ఇవ్వు.
పండ్లవాడు- సార్, ఖరీదే పడదు. నలభై ఐదుకుతీసుకొండి అంతకంటే తక్కువరాదు.
పండ్లవాడు- సార్, ఖరీదే పడదు. నలభై ఐదుకుతీసుకొండి అంతకంటే తక్కువరాదు.
చంచల్- సరే ఓ డజను ఇవ్వు.
రేట్లు మండిపోతున్నాయి అనుకొని చివరకు ఓ డజను అరటి
పళ్ళతో ఇంటికి చేరాడు. ఇంట్లోఅడుగుపెట్టగానే అతని కూతురు (మోహ) ఉత్సాహంగా నాన్న
నేను రెడీ అని అరుస్తూ వచ్చింది.
చంచల్-- ఆశ్చర్యంగా రెడీనా? ఎందుకు? దేనికి?
మోహ- అమ్మ చెప్పింది మనం డిన్నర్ కి
బయటకెళ్తున్నామని.
చంచలుడు - బయట డిన్నర్కా? అమ్మెక్కడ?
మోహ- అమ్మ డ్రెస్ మార్చుకుంటోంది.
చంచల్ - అలాగా, సరే నీవు ఆడుకోమ్మ, నేను అమ్మతో
మాట్లాడతా.
చంచల్ కూతురితో చెప్పి పడకగదిలోకి వెళ్ళాడు. అప్పుడే
తన భార్య ఆకర్ష బట్టలు మార్చుకుంటూ, అర్థనగ్నంగా కనిపించే సరికి చంచలుడు గురువును కలిసిన
మొదలగువిషయాలన్నీమర్చిపోయి, తన భార్యనుసమీపించి వెనకనుండి గట్టిగా కౌగిలించుకుని
మెడవంపులో వాలిపోయాడు.
ఆకర్ష – సర్లేండి వేళాపాలలేకుండా, మనం రెస్టారెంట్
కి వెళ్ళాలి.
చంచల్- ఎందుకు? ఏమిటివిషయం?
ఆకర్ష – మా సింగపూర్ అత్తయ్యలేదా, ఆమె అమమ్మ కాబోతుంది,
అందుకే మనం కూడా వేడుకచేసుకోవాలి కదా?
మీ అత్తేవరో అమమ్మ అయితే మనం వేడుకచేసుకోవడమేంటి? అని
అడగాలనుకున్నాడు. కానీ ఆమెను చూసి
అడగలేక పోయాడు. తన సంతోషాన్ని పాడుచేయకూడదనుకుని. ఇలాంటి సంతోషకర సమయంలో తను పడక
పై ఎలా సహకరిస్తుందో తెలుసు కాబట్టి ఆ అవకాశాన్ని
ఉపయోగించుకోదలచుకుని ...
చంచల్ - ఊ..ఊ..నిన్నిలా చూస్తుంటే... నా
మనస్సాగడంలేదు, మన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోకూడదూ...
అకర్ష – లేదు.. లేదు. మొదట ఈ భోజనం తరువాతే ఆ భోజనం
సంగతి. పాప ఎదురుచూస్తోంది. తయారైకూర్చుంది. మీరుతొందరగా కదలండి. తొందరగా వెనక్కి
వచ్చేద్దాం సరేనా? అవునూ
మీరు మీ ఫోనెందుకుతీయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసాను? ఏమిటి విషయం?
అప్పుడు చంచలుడికి గుర్తొచ్చింది.
గురువు గారితో మాట్లాడేందుకు సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన విషయం.
చంచల్ - అవును అది చాలా ముఖ్యమైన విషయం, నీకు
చెప్పాలి.
ఆకర్ష- సరేనండి, దారిలో మాట్లాడుకోవచ్చు, త్వరగ
పదండి.
చంచలుడు భార్యా పిల్లలతో ఊరిలోని ఓ పేరున్న
రెస్టారెంట్ కు బయలుదేరాడు. మోహ దారంతా వారితో మాట్లాడుతూనే వుంది. దాంతో గురువుగారి గురించి చెప్పే అవకాశం చంచలుడికి
కలగలేదు. వాళ్ళు దాదాపు రెండుగంటలు, రెండువేల రూపాయలు
ఖర్చు చేసి బయటకొచ్చారు. అప్పటికి మోహ
నిద్రపోయింది. దార్లో వారంతా రెస్టారెంట్లో తిన్న వాటిగురించి మాట్లాడుతూ ఇంటికి చేరే సరికి సమయం పదకొండైంది. తదుపరి మిగతా ఆకలిలు తీరే
సరికి ఇంకో గంట గడిచింది. ఆ తర్వాత ఆకర్ష అడిగింది.
ఆకర్ష- అవునండి మీరేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని
అన్నారు. ఎంటది?
చంచల్- ఓహ్... మరిచిపోయాను, అదేంటంటే..
అని తను గురువుగారిని కలవడం గూర్చి వివరించాడు.
ఆకర్ష- చాలా మంచి విషయం, తప్పక నేర్చుకొండి. నా వల్ల వీలైనంతా
సహకారం మీకెప్పుడూ వుంటుంది. వీలైనప్పుడూ మమల్ని కూడా
గురువుగారి దగ్గరకు తీసుకెళ్ళండి.
చంచల్- తప్పకుండా! మొదట నేను గురువుగారు నేర్పే విషయాలు నేర్చుకున్న తర్వాత, వీలుచూసుకొని మిమ్మల్నిద్దరినీ
ఒకేసారి తీసుకెళ్తా. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నేను పొద్దున్నే 4 గంటలకు లేవాలని చెప్పి ఆమె కౌగిలిలో
చేరి నిద్రకుపక్రమించాడు.
చంచలుడికి మెలుకవచ్చేసరికి పొద్దున 6 గంటలైంది.
త్వరత్వరగా స్నానాదులు ముగించుకుని తను బేరంచేసి 45రూపాయలతో
కొన్న డజను అరటి పళ్ళతో గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు.
ఇంకావుంది.....
No comments:
Post a Comment