SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, May 17, 2017

శ్రీవిద్యా ప్రస్థానం - 4



శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

4


ల్లి ఎప్పుడూ తన బిడ్డల బాగు కోసం పరితపిస్తుంది. అందుకే అమ్మవారు తన పిల్లలు సరియైన మార్గంలో నడవడానికి వీలైనన్ని అవకాశాలను వారి ముందుంచుతుంది. సరియైన సాధనా మార్గంలో ముందుకు సాగాలని కాంక్షిస్తుంది. ఆధ్యాత్మికా సాధనా మార్గంలో పూలుంటాయి, ముళ్ళు ఉంటాయి. కానీ అమ్మవారెప్పుడూ మనతో వుండి ముందుకు పయనించే శక్తిని, ధైర్యాన్నిస్తుంది. మనం ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోవడానికి తనే తమై నిలుస్తుంది. అందుకే అమ్మ – శ్రీమాత. ఎల్లప్పుడూ తన పిల్లలపై అనుగ్రహ మాతృత్వ మరందాన్ని కురుపించే జగన్మాత. ఈ క్రమంలో అనుగ్రహ, ఆగ్రహాలను చూపిస్తుంది. ఆమె ఆగ్రహం మాతృత్వంతో కూడినది. అంటే మనను సరియైన మార్గంలో పెట్టటానికి జరిపే పరీక్షలు. అవి ఎండమావులలాంటివి. అమ్మ ప్రేమలో అవి కరిగిపోతాయి.

ఎలా అంటే అమ్మ చూపించే ఆగ్రహం మనను మన గమ్యానికి చేర్చే దగ్గరి దారులు. అనుగ్రహామే నిజమైన అడ్డంకి కావచ్చు. అదేలాగో ముందు ముందు వివరించడమైనది. పాఠకులకు అవగతమౌతుంది. ఆధ్యాత్మి పురోగతికి ఈ (ద్వందాలు)కూడలి ప్రధాన మలుపై నిలుస్తుంది. ఇదే సాధకుని సాధనా ప్రగతిని నిర్ణయిస్తుంది.
వివరంగా చెప్పాలంటే రజోతమో గుణాలు పువ్వుల్లాంటివి. సాధనలోముందుకు సాగుతుంటే మొదట రజోగుణం తన ప్రతాపంతో లోంగదీసుకొన ప్రయత్నిస్తుంది. లేదా తమోగుణం విరుచుకుపడుతుంది. ఒక్కోసారి రెండూ ఒకే సారి దాడి చేస్తాయి. (రజో తమో గుణాలను గూర్చి ఇంతకు ముందే వివరించబడినది). గట్టి సంకల్ప బలం లేని సాధకుడు సునాయసంగా వీటికి లోంగిపోతాడు. ఎందుకంటే దేవతల కంటే రాక్షసులు బలవంతులు. శ్రీరాముడంతటి వానికి రావణుని చంపడానికి గొప్పసాధన, గొప్పగొప్ప మునుల, ఋషుల ఆశీస్సులు వారి తపో బలం అవసమైనాయి. ఇక మనమెంత చెప్పండి.
అందుకే అలాంటి అసురీశక్తులనిగ్రహం కొరకు శ్రీవిద్యా సాధనలో వివిధ మంత్రాలనివ్వడం జరుగుతుంది. శ్రీవిద్యా సాంప్రదాయంలో గురు, మహాగణపతి, బాలా, పంచదశి, షోడశి ఇలా దాదాపు వంద మంత్రాలను ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది మన గమ్యం చేరడానికి ఒక మంత్రం చాలనీ, అసలు మంత్రమే అవసరంలేదని, కేవలం శ్వాసను అనుసరిస్తే చాలని అనడం విడ్డూరం కాదా? చాలా మంది అంటుంటారు కూడా. ఏం సాధించడానికి ఇది? ఏం సాధిస్తారో మరి? నిజానికి మంత్రం లేని స్ఠితి అత్యంత ఉన్నతమైనది. అందుకు మనకు శ్రీరమణ మహర్షిగారే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కాని, ఆయన అటువంటి స్థితి ఎన్నో జన్మల సాధనా ఫలితం. సాధారణ మానవులమైన మనకూ అటువంటి స్థితి రావాలంటే మనం ఎంత మంత్ర సాధన చెయ్యాలి? అంతే గాని, ఊరకే ఓ నాలుగు గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చేదేమిటి?
చివరికి మాత్రం అసుర శక్తులైన రజోతమో గుణాలకు బలై ఏమీ సాధించలేక నిరాశ, నిసృహలకులోనే సాధన గూర్చి మరిచి పోతారు లేదా ఇంకో మార్గమేదైనా అవలంబిస్తారు.
సాధన  అంతర్యాగ, బహిర్యాగాల కలయిక – బహిర్యాగం చిత్తశుద్ధికి. బహిర్యాగంతో చిత్తాన్ని సక్రమంగా శుద్ధి చేసుకుంటే, అంతర్యాగంతో తేలికగా మన గమ్యమైన అమ్మ ఒడిని చేరవచ్చు. అందుకే ఈ రెంటిని తగు శ్రద్ధతో ఆచరించాలి.
ముందుగా బహిర్యాగం అంటే ఎమిటో చూద్దాం. బహిర్యాగం బాహ్యపూజ ప్రధానమైనది. బాహ్యపూజలో ప్రతిమ లేదా ఫోటో లేదా యంత్రానికి పూజ జరుగుతుంది. దీనితో చిత్తశుద్ధి ఎలా జరుగుతుంది? చిత్తశుద్ధి వెంటనే జరుగదు. బహిర్యాగాన్ని శ్రద్ధతో ఓ యఙ్ఞంలా ఆచరించాలి. ఈ పద్ధతులను మన గురువుగారి ద్వారా నేర్చుకుని వారి సమక్షంలో సరియైన సాధన చేసి, వారి అనుఙ్ఞ పొందిన తరువాత సొంతంగా నిర్వహించడం ఉత్తమం. అంతే కాని సెల్ ఫోనులో, సి.డిల ద్వారా అనుకరణతో ఆచరించడం మంచి పద్ధతి కాదు. కారణం మంత్ర ఉచ్ఛారణ పద్ధతులు గురువు ద్వారా వారి సమక్షంలో నేర్చుకోవడం మంచి పద్ధతి. శ్రీపరుశురాములవారు కూడా వారి గురువు గారైన శ్రీదత్తాత్రేయుల వారి ద్వారా బహిర్యాగాన్ని నేర్చుకుని, ఆ తర్వాత వారు మంత్రోపాసన ప్రారంభించారు.
సంధ్యావందనం, పూజ, మంత్రోపాసన మరియు స్తోత్రం ఉత్తమసాధనా క్రమం. సంధ్యావందనార్హతలేని వారికి తల్లిదండ్రుల పూజ సంధ్యావందనంతో సమానం. సంధ్యావందనార్హత ఉన్నవారు కూడా తల్లిదండ్రుల పూజ అనివార్యమే.
ఉపాసనకు జాతి, కుల, మత, లింగ భేదమేమి లేదు. కేవలం తపన,తృష్ణలు మాత్రమే అర్హతలు.
శ్రీవిద్యా పూజయందు, శ్రీచక్రార్చన చాలా ముఖ్యము. సాంప్రదాయ పద్ధతి ప్రకారం శ్రీచక్రార్చనకు సుమారుగా ఐదు గంటల సమయం అవసరం. విస్తారాత్మకంగా నిర్వహించిన పన్నెండు నుండి పదునాలుగు గంటల సమయం తీసుకుంటుంది. ఈ పద్ధతిలో పూజ కనీసం
శరన్నవరాత్రులలో,
వసంతనవరాత్రులలో,
పూర్ణిమ రోజులలో నిర్వహించాలి.
ఇవియే కాక, సాధకుడు నైమిత్తిక పూజ నిర్వహించాలి. నైమిత్తికం అంటే నిమిత్తమాత్రంగా అని అర్ధం. ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా లేక సంకల్పం లేకుండా నిర్వహించే పూజ. నైమిత్తిక పూజ నిర్వహించడానికి పై విధమైన సాధనా క్రమాన్ని ఆచరించే సాధకులు అర్హులు.
నైమిత్తిక పూజను గురువు గారి జన్మదినరోజున గాని, స్వంత జన్మదినరోజున గాని, ఆదివారమునాడు గాని చెయ్యవచ్చు. నిష్కామ పూజ త్వరగ సిద్ధినిస్తుంది. కానీ ఈ రోజుల్లో శ్రీచక్రార్చన వ్యాపార ధోరణిగామారడం బాధకరమైన విషయం. పర్యావసానంగా అలాంటి బిడ్డడి ఎదుగుదలను గూర్చి అమ్మ గర్వించాలా, గర్హించాలా?

No comments:

Post a Comment