శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
-
శ్రీభువనానంధనాథులు
2
ఓ
సాధకుడా! మాయను గూర్చివిచారించకు. అమ్మవారి కరుణాపూరిత ఆశీస్సులు రజో,తమోగుణాల రూపంలో నీపై ఉన్నాయి. ఆశ్చర్యపడ వద్దు. ఎందుకంటే అన్ని గుణాలు
అమ్మవే. అమ్మ
తనలోనే ఉన్నఅన్ని గుణాలలోంచి నీవాశించిన వాటినిస్తుంది. కారణం నీ మనో ఫలకం రజో,
తమోగుణాలతో నిండివుంది. అందుకే అమ్మ అదే రూపంలో బిడ్డడిని
హత్తుకుని వుంది. నమ్మినా, నమ్మకున్నా ఇదే నిజం.
మరి అన్ని గుణాలు అమ్మవే అయితే ఈ సాధనెందుకు? అమ్మను ఈ రజో,
తమోగుణాలతో ఆరాధించవచ్చు కదా? అని నీకు అనుమానం రావచ్చు.
తన పిల్లల ఈ రజో,
తమోగుణాల చేష్టలు అమ్మను బాధపెడతాయి. మన దయనీయతని చూసి అమ్మ
కంటతడిపెడుతుంది. బాబూ! నిన్నంటి పెట్టుకున్న గుణాలతో నన్ను చేరుకోలేవని,
సత్వగుణ తత్త్వమే నను చేరుటకు మార్గమనీ, సత్త్వగుణ
శుద్ధతత్త్వమే సదాశివతత్వమనీ రజోగుణం వీడక పోతే నీ తండ్రైన శివుని చేరలేవని జననమరణ
చక్రాన్ని వీడలేవని చింతిస్తుంది. (బిడ్డ ఎలాంటి వాడైనా అమ్మ
వత్తాసు బిడ్డకే కదా. అమ్మ ఈ తీరు లోకంలో కూడా గమనించవచ్చు.) ఇదే ఇక్కడ
తెలుసుకోవలసిన ముఖ్యవిషయం.
రజోగుణం ద్వారా పోందే ఆనందం
అశాశ్వతమైనది. నీవు ఎల్లప్పుడూ శాశ్వతమైన ధనం,
కీర్తి, ఆస్తులు కావాలని కోరుకుంటావు. అవన్ని
అశాశ్వతమని నీవు గ్రహించలేకున్నావు. కాని, శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకు కోరుకోవు? ఒకసారి శాశ్వతమైన ఆనందం
రుచితేలిస్తే ఇక అశాశ్వతమైన ఆనందం గూర్చి ఎప్పటికి ఆలోచించవు.
క్షణికమైన ఆనందాన్నిచ్చే రజో,తమో గుణాలను వీడి సత్వగుణ మార్గాన జగజ్జననీజనకుల చేర పయనం సాగించు. ఆ
పయనమే ఆధ్యాత్మిక సాధన.
పిల్లల చేష్టలు తల్లిమాటలలో
అంతరార్థన్ని గ్రహించలేక పెడచెవిన పెట్టడమో, అనవసరమైన వానికి ప్రాముఖ్యతనిచ్చి తల్లిని ఒప్పించ ప్రయత్నమో చేస్తారు. సులభంగా అర్ధమవాలంటే
పిల్లలు టి.వి, సినిమాలు మొదలైన లౌకిక
కార్యాలకి అమ్మ సిఫారసు కోరడాన్ని ఉదహరించవచ్చు. పిల్లల కోరికలను అమ్మ
తోసిపుచ్చలేదు కదా! కానీ ప్రేమకు ప్రతిరూపమైన తల్లి జాలితో నిస్సహాయంగా
వుండిపోతుంది. అదే తండ్రి మన తప్పిదాలకు దండిస్తారు. దాంతో ఆ కోపాన్ని మనం అమ్మ పై
కూడా రుద్దుతాము. కాని స్వచ్చమైన ప్రేమకు ప్రతిరూపమైన అమ్మ తన పిల్లలను ఎల్లప్పుడూ
క్షమిస్తూనే ఉంటుంది. వారి ఉన్నతికై తగిన సమయము గురించి ఎదురు చూస్తూ
ఉంటుంది.
ఇది నిజం కాదా? ఇది అమ్మ
ప్రేమకు ఓ మచ్చుతునక. ఇది పాఠకులందిరికి తెలిసిన లేదా అనుభవమున్న విషయమే కదా. ఓ
సాధకుడా! అవునో కాదో నిన్ను నీవే తరచి చూసుకో.
ఇలాంటి సంఘర్షణ మన మనస్సులో జరిగే
వుంటుంది. మహిషాసుర సంగ్రామం, నేనింతకు
ముందే చెప్పాను మహిషాసురుడు రజోగుణానికి ప్రతీక. మన మనసులను మహిషాసురుడు ప్రభావితం
చేస్తే మన బుద్ధి దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ బుద్ధి పై మనస్సే నెగ్గుతుంది.
మనస్సెప్పుడు రజోగుణాన్ని కోరుతుంది.
దీనర్థం మహిషాసురునితో యుద్ధంలో
దేవతలు ఓడిపోవడం. మరేంచేయాలి? అందుకే సత్వగుణ ప్రధాయిని అయిన అమ్మ అనుగ్రహానర్థించాలి.
మహిషాసురుని గెలవ నిస్సహాయత తొలగించమని
అమ్మను అర్థించాలి. అమ్మను చేర దారిచూపమని ప్రార్థించాలి. దుఃఖ ప్రదాయకమైన
విషయాలనుండి విముక్తి ప్రసాదించమని వేడుకోవాలి. అదే బీజం (విచార బీజం). ఇది సాధనలో
ముఖ్య ఘట్టం. ఈ విచార బీజానికి సంబంధించిన జిఙ్ఞాసను మనలో నాటి,
పెంపోందించుకోవాలి.
సాధన చేయమని ప్రతి ఆధ్యాత్మిక గురువు
చెప్తారు, మరి సాధనంటే ఎమిటి? ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? సాధన భగవంతుని వద్దకు
చేరుస్తుందా? ఇక్కడ నేనోక విషయం నొక్కి చెప్పదలుచుకున్నాను భగవంతుడు అనే
వాడు లేడు. ఆశ్చర్యంగా వుందా? అవును ఖచ్చితంగా భగవంతుడు అనే వాడు లేడు!
ఆశ్చర్యంగా వుందా? అవును నేను
మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తాను, భగవంతుడు
లేడు. మరి దేవుడు లేకపోతే ఈ సాధనెందుకు? మన చిత్తాన్ని శుద్ధ పరిచి మనలోనే
ఉన్న దేవతా తత్త్వాన్ని అనుభవించడానికి. నీకు వేరుగా దేవుడు
లేడని తెలుసుకోవడానికి సాధన. చిత్తాన్ని శుద్ధపరడం ద్వారా
రజో, తమోగుణ మాలిన్యాలు (దోషాలు)
తొలగించబడతాయి. అప్పుడు పరిపూర్ణ తత్త్వం
అవగతమవుతుంది. అదే సాధన. అదే అహం బ్రహ్మాహమస్మి స్థితి.
చిత్తాన్ని శుద్ధిపరచే ప్రక్రియేమంతా
సులభ విషయం మాత్రం కాదు.
సాధన రెండు విధాలు –
ఒకటి బహిర్యాగం, ఇంకోకటి అంతర్యాగం.
దృరదృష్టవశాత్తు ఈ రోజుల్లో ధ్యానం అంటే గంటలకొద్ది
స్థిరాసనంలో కళ్ళుమూసుకుని కూర్చోవడం, గొప్ప కాంతిని దర్శించిన అనుభవాలు చెప్పుకోవడం, భగవతదర్శితమైనట్టు
ఢాంబికాలు పోవడం, గొప్పలు డప్పుకోవడంలాంటి ప్రహసనాలు ఎక్కువైపోయాయి. ఇదే ఓ
గొప్పసాధనగా అభివర్ణించబడుతోంది.
ఇదో గర్వపూరితమైన ఫలితంలేని, పనికిమాలిన, మతిలేని, యాంత్రికమైన ప్రక్రియ.
ఇలాంటివి, వారికి
తెలియకుండానే వారిని రజో,తమోగుణ మత్తులో
ముంచుతాయి. ఇలాంటి వాటిని అంతర్జాలంతో జోడించి, ఆశ్రమాలను
ప్రారంభించి ప్రచారం, ధ్యాన భోదన ఆరంభం వీటి వెంట జనం
పరుగు.... ఇలాంటి పిచ్చిలో ధనం, సమయం వృధా తప్ప పెద్దగా
ప్రయోజనం మాత్రం జాస్తి. కానీ వారేదో గొప్ప సాధన చేస్తున్నామన్న భ్రాంతిలో
మునుగుతున్నారు. ఇదే మాయ. తమను తాము చేసుకుంటున పెద్ద మోసం, మరి
డబ్బులేకుండా విద్య ఎలా? గురు దక్షిణ ఎలా? అన్న సందేహం నీకు కలగవచ్చు. పూర్వ
కాలంలో గురుదక్షిణ అన్నది ఆశ్రమాల నిర్వహణకు,
అది కూడా అపరవిద్య(భుక్తివిద్య) – వేదపఠనం,
యుద్ధవిద్యలను గూర్చిన ఆశ్రమాల నిర్వహణకు ఉండేది. అంతేకానీ
బ్రహ్మవిద్యకు సంబంధించిన ఆశ్రమాలు అప్పుడూలేవు, కానీ
ఇప్పుడు.....!!
శ్రీవిద్య బ్రహ్మవిద్య. ఓ సాధకుడా!
ఒక్క విషయం గుర్తు పెట్టుకో. ఆధ్యాత్మికత,
అందునా బ్రహ్మ విద్యను డబ్బుతో కొనలేవు.
మరిసాధన అంటే ? ? ?
No comments:
Post a Comment