జ్యేష్ట శుద్ధ చవితి
శ్రీధూమావతి జయంతి సందర్భంగా.....
ధూమావతి: దశమహావిద్యలలో
అతి విచిత్రమైన అవతారం ఇది.ఈమె ఒక వితంతువుగా తంత్ర శాస్త్రంలో పేర్కొనబడినది.
ఈమెను దూమ్రావతి అని కూడా అంటారు. యోగనిద్రా స్వరూపిణి అంటే యోగులైనవారిని
యోగనిద్రలో ఉంచేటువంటి శక్తి. ఈమె ఉగ్రదేవత.
ఒక నాడు పరమశివుడు ధ్యానంలో ఉండగా
పార్వతీదేవి ఆకలిగా ఉంది అని అడుగగా శివుడు వేచి ఉండమనెను, మరల కొంత సమయం
గడిచాక పార్వతిదేవి శివుని చూచి ఆకలి అని అడుగగా శివుడు మరల వేచి ఉండమని చెప్పెను,
అది విని పార్వతిదేవి మిక్కిలి కోపంతో శివుని మ్రిగేసింది. ఆమెలో
ఉన్న శివుడు కోపంతో మూడోకన్ను తెరచి పార్వతిదేవితో ఇట్లనెను "ఈ లోకంలో
పురుషుడు అనే వాడు ఉండడు అనెను" దాని ప్రతిఫలమే ఆమె వితంతువు రూపం. శివుడు
మూడో కన్ను తెరువగా ఆమెలో నుండి పొగ రాసాగింది అందువల్లనే ఆమెకు ధూమవతి అని పేరు.
దశ మహావిద్యలకు జ్యోతిష శాస్త్ర సారుప్యత దృష్ట్యా
ధూమవతి కేతుగ్రహాదిష్టాన దేవత. ఈమె
చూడటానికి వికారంగా, చేతిలో చాటతో, పొగసూరిన బట్టలతో, మెల్లకళ్ళతో, గుర్రంలేని బండిపై కూర్చుని
ఉంటుంది.ధూమవతి సిద్ధిని ప్రసాదించే తల్లి.
యత్ర అగ్నిః
తత్ర ధూమః –
అవిద్య నుండి విద్యను, విద్యాతత్త్వాన్ని అనుభూతి చేయగలది ధూమావతి. మానవుని నిద్రా, నిద్రారాహిత్యాలు ధూమవతి యొక్కవైభవము
ధూమావతి అంటే ఉపాసనా పరంగా మహామౌనమని కూడా అర్థం.
ఉపనిత్తులలో పేర్కొన్న భూమావిద్య. ఇది పూర్ణవిద్య మరియు అపూర్ణవిద్య కూడా – విద్యాఽవిద్యా
స్వరూపిణి
లౌకికంగా ఆలోచిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే
ముందు జ్యేష్టాదేవి కృపతో అలక్ష్మిని తొలగించికోవాలి, జ్యేష్టాదేవి దయ ఉంటేనే
లక్ష్మీదేవి ప్రాసాదించే సంపద మనకు దక్కుతుంది. ధూమావతి మంత్రాలలో జ్యేష్టాదేవి
మంత్రంకూడా వుంది. లోకంలో సంపద ఉంచాలన్నా తీసేయాలన్నా ఈమే కారణం.
No comments:
Post a Comment