భవతి పరవాక్ భైరవ్యాఖ్యా
పశ్యంతి సాకధితా తారా
రసనిధి మాప్తా జిహ్వరంగం
మాతంగీతి ప్రధితా సేయం
-ఉమా సహస్రం (శ్రీకావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని)
ఈ సృష్టికి వరం శబ్ద శక్తి. ఈ శబ్ద శక్తి 'పర ', 'పశ్యంతి ', 'మధ్యమ', 'వైఖరి ' అనే నాలుగు రకాలుగా విభజించబడింది. బయటికి వినిపించేలా గట్టిగా చదువే మంత్రాలు వైఖరి, పెదవులు కదుపుతూ నెమ్మదిగా చదివే పూజ మంత్రాలు మధ్యమ. మౌనంగా మనసులో చేసే ధ్యానం పశ్యంతి. వీటన్నిటికి అతీతమైన స్థితిలో ఉండే శబ్ద శక్తి పరా.
న్యాసమనగా ఉంచుట అని అర్థం. అక్షరములయందు అపారశక్తి కలదు. దేవనాగరిలిపిలో ఉన్న అకార – క్షకారాంత వర్ణములను(51) మాతృక అంటారు. ఈ మాతృకలను శరీరంలోని వివిధ
అవయవములయందు ఉంచుటయే మాతృకా న్యాసం. మంత్రశాస్త్రమందు న్యాసమునకు చాలా ప్రాముఖ్యత
ఉన్నది.
షోడాన్యాసం ప్రకుర్వీత దేవతాత్మత్వసిద్ధయే |
కేవలన్యాస మాత్రంచే కూడా సిద్ధిపొందే అవకాశమున్నదనునది శాస్త్ర ప్రమాణం.
న్యాసము చాలా మహత్తుగలది.
షోడాన్యాసం నిత్యం ఆచరించే మంత్రవేత్త తన ఏక హస్త తాడనచే ఏనుగును, పాద తాడనచే మహావృక్షాన్ని పడగోట్టగలడు.
మన కోసం పూజ్యగురుదేవులు శ్రీభువనానంధనాథులవారిచే శ్రీచక్రన్యాసం (ఖడ్గమాలా
విధానముగా) గూర్చి శీర్షిక త్వరలో....
No comments:
Post a Comment